Health juice: ఆరోగ్యానికి చెరుకు రసం, కొబ్బరి నీళ్లల్లో ఏది మంచిది..

వేసవి కాలంలో ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది. దాహం తీర్చుకోవడానికి నీరు తో పాటు.. పండ్ల రసాలు, శీతల పానీయాలు తాగుటుంటారు. అయితే వేసవిలో ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిచ్చే వారు చెరకు రసం, కొబ్బరినీరు..

Health juice: ఆరోగ్యానికి చెరుకు రసం, కొబ్బరి నీళ్లల్లో ఏది మంచిది..
Sugar Cane, Coconut Water
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:17 PM

Health News: వేసవి కాలంలో ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది. దాహం తీర్చుకోవడానికి నీరు తో పాటు.. పండ్ల రసాలు, శీతల పానీయాలు తాగుటుంటారు. అయితే వేసవిలో ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిచ్చే వారు చెరకు రసం, కొబ్బరినీరు వంటివాటిని తీసుకుంటారు. కూల్ డ్రింక్స్ తో పోలిస్తే ఈరెండు మంచివే. అయితే ఈరెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం. ఈ రెండూ దాహాన్ని తీర్చే ఉత్తమమైన పానీయాలు. వీటిని తాగడం ద్వారా దాహం తీరడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

తిన్న ఆహారం జీర్ణం కావడానికి చెరకు రసం ఒక టానిక్‌గా పనిచేస్తుంది. కొబ్బరి నీరు కూడా సహజ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. తద్వారా హైపర్‌టెన్షన్ రకమైన సమస్యలతో పోరాడుతుంది.

ఒక వ్యక్తి తీవ్రంగా డీహైడ్రేషన్ కు గురైనప్పుడు రోగనిరోధక శక్తిని పొందేందుకు కొబ్బరి నీరు లేదా చెరుకు రసం తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఈక్రమంలో ఈరెండింటి వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

చెరకు రసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: చెరకు లో ఉండే సుక్రోజ్ శరీరానికి శక్తిని అందిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ విడుదలను నియంత్రిస్తుంది, షుగర్ లెవెల్స్ పడిపోయిన సమయంలో వాటిని తిరిగి పొందేందుకు చెరుకు రసం దోహడపడుతుంది. శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి, అలసట నుండి బయటపడటానికి చెరకు రసం ఉపయోగపడుతుంది.

సులభంగా మూత్రవిసర్జన: చెరకు రసం మూత్ర నాళాల ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో సహాయపడుతుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా ఉన్నప్పుడు, మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో చెరకురసం ఉపయోగపడుతుంది.

దుర్వాసన పొగొట్టేందుకు: చెరకు రసంలో కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి దంతాల్లో ఎనామిల్‌ను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చెరకు రసంలో ఉండే అధిక పోషక పదార్థాలు.. పోషకాల లోపం వల్ల వచ్చే నోటి దుర్వాసనను నివారిస్తుంది.

కామెర్ల వ్యాధికి చికిత్సగా: చెరకు రసంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కాలేయాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడతాయి. శరీరంలో ప్రోటీన్లు, పోషకాలను పునరుద్ధరించేందుకు చెరకు రసం ఒక ఔషధంగా ఉపయోగపడుతుంది.

చర్మ సంరక్షణ: ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గించడం, చర్మం మృదువుగా, జిడ్డుబారకుండా ఉండే లక్షణాలు చెరకు రసంలో ఉన్నాయి. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ చర్మ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తాయి.

కొబ్బరి నీళ్ల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్య ప్రయోజనాలు: కొబ్బరి నీళ్లు తియ్యగా ఉన్నప్పటికి 99% కొవ్వు, కార్బోహైడ్రేట్ లేని తాజా కొబ్బరి నీరు జీవశాస్త్రపరంగా స్వచ్ఛమైనది. ఎలక్ట్రోలైట్‌లతో నిండి ఉంటుంది. చక్కెరతో కూడిన శీతల పానీయాలు, స్పోర్ట్స్ డ్రింక్స్, జ్యూస్‌లతో పోలిస్తే కొబ్బరి నీళ్లు ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

యూరినల్ ఇన్ఫెక్షన్ కు వ్యతిరేకంగా: అజీర్ణం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వంటి జీర్ణ, మూత్ర సంబంధిత వ్యాధులకు కొబ్బరి నీరు దివ్య ఔషధంగా ఉపయోగబడుతోంది.

జీర్ణక్రియను సులభతరం చేస్తుంది: జీర్ణక్రియ ప్రక్రియలో నిరంతరం ఇబ్బందిని ఎదుర్కొంటే కొబ్బరి నీరు ఉపశమనాన్ని అందిస్తుంది. ఫైబర్ యొక్క అధిక సాంద్రత కారణంగా కొబ్బరినీళ్లు అజీర్ణాన్ని నివారిస్తుంది.

హైడ్రేషన్ కోసం: ఎనర్జీ డ్రింక్స్ తో పోలిస్తే కొబ్బరి నీళ్లలోని పదార్థాలు మానవ శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. కఠోరమైన వ్యాయామం లేదా ఎక్కువసేపు శారీరక శ్రమ చేసే సమయంలో మన శరీరంలో మినరల్స్ అధికంగ ఉండే ఆహారం తరిగిపోతుంది. అలాంటి సమయాల్లో కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా శరీరానికి శక్తినిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:ఎలక్ట్రోలైట్‌ల అసమాన స్థాయి అధిక రక్తపోటుకు దారి తీస్తుంది. ఈసమయంలో కొబ్బరి నీళ్లలో ఉండే పదార్థాలు అధిక రక్తపోటును తగ్గించే లక్షణాలు కలిగిఉంటాయి. కొన్ని సందర్భాల్లో, ఈ ఎలక్ట్రోలైట్‌ల సమతుల్యతను పెంపొందించడానికి ప్రతి రోజు కొబ్బరి నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. చెరుకురసం, కొబ్బరి నీళ్లు ఈరెండింటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే చెరుకురసంతో పోల్చినప్పుడు కొబ్బరినీళ్లలో అధిక ప్రయోజనాలు ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాల కోసం చూసుకునేవారు కొబ్బరినీళ్లను తాగడం మేలు.

కాబట్టి, మీరు మీ కొబ్బరి నీళ్లను వదులుకుని చెరకు రసానికి మారాలా? చెరకు రసం కంటే కొబ్బరి నీళ్లలో చక్కెర, కేలరీలు మరియు నీరు తక్కువగా ఉంటాయి మరియు మనలో చాలా మందికి లేని పొటాషియం చాలా ఉంది. ఆ కారణాల వల్ల, సాధారణంగా కొబ్బరికాయను గెలవడం ఉత్తమం. మీరు ఆరోగ్య ప్రయోజనాల కోసం చూస్తున్నట్లయితే, కొబ్బరి నీళ్లకు అతుక్కోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!