Vizag: సాయి ప్రియ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న విశాఖ పోలీసులు..

Vizag: సాయి ప్రియ ఎపిసోడ్ ను సీరియస్‌గా తీసుకున్నారు విశాఖ పోలీసులు. నేవీ, కోస్ట్ గార్డ్, పోలీస్ సిబ్బందిని ముప్పతిప్పలు పెట్టి....

Vizag: సాయి ప్రియ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న విశాఖ పోలీసులు..
Saipriya
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 30, 2022 | 5:50 PM

Vizag: సాయి ప్రియ ఎపిసోడ్ ను సీరియస్‌గా తీసుకున్నారు విశాఖ పోలీసులు. నేవీ, కోస్ట్ గార్డ్, పోలీస్ సిబ్బందిని ముప్పతిప్పలు పెట్టి.. అధికారుల విలువైన సమయాన్ని, ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడంపై యాక్షన్ మొదలుపెట్టారు. సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై నిన్న కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇవాళ ఆమె తండ్రి అప్పలరాజుపై చర్యలకు ఉపక్రమించారు. ఈ విషయాన్ని విశాఖపట్నం త్రీటౌన్ సీఐ రామారావు వెల్లడించారు.

సాయిప్రియ తండ్రిపై కేసు..

ప్రభుత్వ ఉద్యోగి అయిన సాయి ప్రియ తండ్రి అప్పలరాజు ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడంపై సీరియస్ అయ్యారు పోలీసులు. కోర్టు అనుమతితో అప్పలరాజుపై 182 ఐపిసి సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు త్రిటౌన్ పోలీసులు. సాయి ప్రియ తన ప్రియుడు రవితేజతో వెళ్లిపోతున్నట్లు తండ్రికి ముందే తెలిసిందని, సాయిప్రియ భర్త పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఘటనపై విచారించిన పోలీసులు కోర్టు అనుమతితో యాక్షన్ షూరు చేశారు.

ఇవి కూడా చదవండి

సాయిప్రియ, రవితేజపై కేసులు..

సాయిప్రియ, ప్రియుడు రవితేజపైన నిన్న త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. నెల తరువాత కోర్టు అనుమతి, ఆదేశాలతో ఐపీసీ సెక్షన్ 420, 417, 494, 202 రెడ్ విత్ 34 కింద సాయిప్రియ ఆమె ప్రియుడు రవితేజలపైన కేసు పెట్టారు విశాఖ త్రీటౌన్ పోలీసులు. గత నెల జులై 25న పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాస్‌తో కలిసి సాయిప్రియ ఆర్కేబీచ్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. భర్త బీచ్‌లో కాళ్లు కడుక్కునే సమయంలో ప్రియుడు రవితేజతో కలిసి వెళ్లిపోయింది. తర్వాత తండ్రి పిర్యాదుతో సాయిప్రియ కోసం జిల్లా యత్రాంగం, నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది పెద్ద ఎత్తున బీచ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. సాయిప్రియ ప్రియుడితో కలిసి వెళ్లిపోయినట్లు సమాచారం అందడంతో అంతా అవాక్కయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్