Andhra Pradesh: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. పండుగకు స్పెషల్ ట్రైన్స్.. వివరాలు ఇవిగో!
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ అందించింది.. వినాయక చవతికి స్పెషల్ ట్రైన్స్..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ అందించింది. రేపు, ఎల్లుండి అనగా ఆగష్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్(Secunderabad – Tirupati – Secunderabad) మధ్య తిరగనున్నాయి. ప్రయాణీకుల రద్దీ, వినాయక చవితి పండుగ దృష్ట్యా ఈ రైళ్లను నడపనున్నట్లు ద.మ. రైల్వే మంగళవారం కీలక ప్రకటన విడుదల చేసింది.
ప్రత్యేక రైలు( నెం. 07120) ఆగష్టు 31వ తేదీన(బుధవారం) సాయంత్రం 6.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 08.45 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అటు నుంచి ప్రత్యేక రైలు( నెం. 07121) సెప్టెంబర్ 1వ తేదీన(గురువారం) రాత్రి 9.10 గంటలకు తిరుపతిలో బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 09.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్స్‌లో స్లీపర్, 3ఏసీ, 2ఏసీ, జనరల్ బోగీలు ఉండగా.. ఇవి బేగంపేట్, వికారాబాద్, తాండూర్, రాయచూర్, మంత్రాలయం రోడ్డు, గుంతకల్, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట రైల్వే స్టేషన్‌లలో ఆగనున్నాయి.