PM Kisan eKYC: రైతులకు బిగ్ అలర్ట్.. రేపే లాస్ట్ డేట్.. లేదంటే ఆ డబ్బులు ఫసక్..!

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Aug 30, 2022 | 10:09 PM

PM Kisan eKYC: ప్రధాన్ మంత్రి కిసాన్ (PM కిసాన్) పథకం కింద eKYC పూర్తి చేయడానికి లబ్ధిదారులకు ఒక రోజు గడువు మాత్రమే ఉంది.

PM Kisan eKYC: రైతులకు బిగ్ అలర్ట్.. రేపే లాస్ట్ డేట్.. లేదంటే ఆ డబ్బులు ఫసక్..!
Pm Kisan

PM Kisan eKYC: ప్రధాన్ మంత్రి కిసాన్ (PM కిసాన్) పథకం కింద eKYC పూర్తి చేయడానికి లబ్ధిదారులకు ఒక రోజు గడువు మాత్రమే ఉంది. ఆగస్ట్ 31, 2022తో ప్రధాన్ మంత్రి కిసాన్ eKYC పూర్తి చేయడానికి గడువు ముగుస్తుంది. PM కిసాన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం లబ్ధిదారులైన రైతులు గడువు తేదీలోగా eKYC పూర్తి చేయాలి. లేదంటే.. 12వ విడత నిధులు పడకపోవడమే కాకుండా.. తదుపరి నిధులు పడటం ఆగిపోతుంది. అందుకే.. రేపటిలోగా e-KYCని పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం మరోసారి సూచించింది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద భూమిని కలిగి ఉన్న అర్హతగల రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే, ఏడాదిలో 2,000 రూపాయల చొప్పున మూడు విడతలుగా ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడం జరుగుతుంది. పథకంలో భాగంగా 12వ విడత సెప్టెంబర్ 1, 2022 తర్వాత ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. అయితే, ఈ విడత డబ్బును పొందాలంటే.. అర్హత కలిగిన వ్యవసాయ కుటుంబాలు తమ e-KYC ప్రక్రియను ఆగస్టు 31లోపు పూర్తి చేయాలి. లేదంటే వారికి 12వ విడత నిధులు అందవు.

పీఎం కిసాన్ ఆధార్ OTP ఆధారిత eKYCని పూర్తి చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

ఇవి కూడా చదవండి

1. ముందుగా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి.

2. ఫార్మర్స్(రైతులు) అని పేర్కొన్న కార్నర్‌లో eKYC ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.

3. నెక్ట్స్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, సెర్చింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 4 అంకెల OTP వస్తుంది.

4. మొబైల్ నెంబర్‌కు వచ్చిన OTP నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

5. ఆధార్ రిజిస్టర్డ్ చేసినట్లు ఒక OTP వస్తుంది. దానిని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ కోట్టాలి.

6. ధృవీకరించినట్లు చూపించినట్లయితే.. మీ eKYC ప్రక్రియ పూర్తయినట్లే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu