Crime: గిరిజన మహిళకు నరకం చూపించిన బీజేపీ నేత.. ఒళ్లంతా వాతలు పెట్టి.. పళ్లు రాలగొట్టి
జార్ఖండ్ (Jharkhand) లోని గుమ్లా ప్రాంతానికి చెందిన సునీత గిరిజన మహిళ. ఆమె పదేళ్ల క్రితం మహేశ్వర్ పాత్రా, సీమా పాత్రా దంపతుల ఇంట్లో పనికి చేరింది. తరువాత వారి కూతూరు వత్సల పాత్రా ఇంట్లో పని కోసం ఢిల్లీకి పంపించారు. తరువాత...
జార్ఖండ్ (Jharkhand) లోని గుమ్లా ప్రాంతానికి చెందిన సునీత గిరిజన మహిళ. ఆమె పదేళ్ల క్రితం మహేశ్వర్ పాత్రా, సీమా పాత్రా దంపతుల ఇంట్లో పనికి చేరింది. తరువాత వారి కూతూరు వత్సల పాత్రా ఇంట్లో పని కోసం ఢిల్లీకి పంపించారు. తరువాత వాళ్లు రాంచీకి బదిలీపై వచ్చారు. వాళ్లతో పాటే సునీతను మళ్లీ రాంచీకి (Ranchi) తీసుకొచ్చారు. అలా మళ్లీ సీమా పాత్రా దగ్గర పని చేసేందుకు వచ్చింది. పని మావేసి వెళ్లిపోతానన్నా సునీతను ఓ గదిలో బంధించే వాళ్లు. గొడ్డు చాకిరీ చేయించడమే కాకుండా చిత్రహింసలు పెట్టేవాళ్లు. వేడి పెనంతో వాతలు పెట్టేవాళ్లు. సరిగా తిండి పెట్టకుండా మాడ్చేసేవాళ్లు. దాహం వేస్తే మంచినీళ్లు కూడా ఇచ్చేవాళ్లు కాదు. నోరు తెరిచి మాట్లాడనిచ్చేవాళ్లు కాదు. సునీత భయపడి, వణికిపోయి మూత్రం పోసుకుంటే నాలుకతో క్లీన్ చేయించేదట సీమా పాత్రా. సాటి మహిళ అని కూడా చూడకుండా సునీతను చిత్రహింసలు పెట్టింది. ప్రస్తుతం సునీత రాంచీలోని రిమ్స్‌లో చావు బతుకుల్లో ఉంది. ఆమెపై జరిగిన హింసకు సాక్ష్యంగా ఆమె ఒళ్లంతా గాయాలే. మూతి మీద ఎన్నిసార్లు కొట్టారో కానీ పళ్లు విరిగిపోయి ఉన్నాయి. పర్సనల్ డిపార్ట్‌మెంట్ అధికారి వివేక్ బాస్కీ ఆమె గురించి తెలిసి, డీసీ రాహుల్ కుమార్ సిన్హాకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి, మేజిస్ట్రేట్ సమక్షంలో సునీతను విడిపించారు.
వివేక్ బాస్కీ కంప్లైంట్ తో రాంచీలోని అర్గోరా పోలీస్ స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సునీత కోలుకున్న తర్వాత కోర్టులో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తామన్నారు పోలీసులు. సీమా పాత్రాకు ఆయుష్మాన్ అనే కొడుకు ఉన్నాడు. సునీతను హింసించడాన్ని అతను వ్యతిరేకించేవాడు. తల్లితో గొడవపడేవాడు. అయితే అతన్ని రాంచీలోని ఓ సైకియాట్రిక్ ఆస్పత్రిలో చేర్పించింది సీమా పాత్రా. సునీతను అతని తల్లి పెట్టే చిత్రహింసలు చూసి పిచ్చివాడై పోయాడేమో మరి! సీమా పాత్రా దారుణాలు బయటపడడంతో ఆమె అసలు మనిషేనా అని జనం దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు ఆమెపై బీజేపీ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి