Sugarcane Juice: చెరుకు రసంలో ఇది కలుపుకొని తాగితే మొండి దగ్గు మటుమాయం.. ఇంకా మరెన్నో సమస్యలకు చక్కటి ఔషధం..

Sugarcane Juice For Cough: మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీ, కూలర్ లాంటివి ఉపయోగించినా.. చల్లటి నీళ్లు తాగినా దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎదురవుతాయి.

Sugarcane Juice: చెరుకు రసంలో ఇది కలుపుకొని తాగితే మొండి దగ్గు మటుమాయం.. ఇంకా మరెన్నో సమస్యలకు చక్కటి ఔషధం..
Sugarcane Juice
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 09, 2022 | 11:17 AM

Sugarcane For Summer: వేసవి కాలం రాగానే.. హీట్ స్ట్రోక్ వంటి అనేక వ్యాధులు మనందరిపై దాడి చేస్తాయి. ఎందుకంటే ఈ సీజన్‌లో తరచుగా శరీరంలో నీటి కొరత ఉంటుంది. శరీరం హైడ్రెట్‌గా ఉంచడానికి ద్రవ పదార్థాలు, నీటిని తాగడం మంచిది. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీ, కూలర్ లాంటివి ఉపయోగించినా.. చల్లటి నీళ్లు తాగినా దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎదురవుతాయి. దీంతోపాటు చాలా మంది పొడిదగ్గు లాంటి సమస్యను కూడా ఎదుర్కొంటుంటారు. అయితే.. కొన్ని హోం రెమెడీస్ ద్వారా వీటికి చెక్ పెట్టవచ్చు. ఈ క్రమంలో వేసవిలో దగ్గు, కఫం లాంటి సమస్యలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

వేసవిలో చెరుకు రసం ఎందుకు తాగాలి.?

వేసవిలో సాధారణంగా ఎండ వేడి ఉపశమనం పొందడానికి.. శరీరంలో నీటి కొరతను దూరం చేసే చెరుకు రసం తాగడానికి ఇష్టపడతాం. అయితే ఈ మ్యాజికల్ డ్రింక్‌ని ఈ సీజన్‌లో తాగడం వల్ల ముఖ్యంగా జలుబు, దగ్గు లాంటి సమస్యలను నివారించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

దగ్గు సమయంలో చెరుకు రసంలో ఈ పదార్థాన్ని కలపండి

ఎండాకాలంలో జలుబు, దగ్గు లాంటి సమస్యలు వస్తే ఒక గ్లాసు చెరుకు రసం తీసుకుని అందులో కొద్దిగా ముల్లంగి రసం కలుపుకుని తాగాలి. ఈ పద్దతిని ఒక వారం పాటు అనుసరిస్తే.. మొండి దగ్గు కూడా మటుమాయం అవుతుందని సూచిస్తున్నారు నిపుణులు.

చెరుకు రసం ప్రయోజనాలు..

తక్షణ శక్తి లభిస్తుంది : వేసవిలో శరీరంలో నీటి కొరత కారణంగా శక్తి తగ్గడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో చెరుకు రసం తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో రిఫ్రెష్ అయిన అనుభూతి కలుగుతుంది.

కాలేయానికి మేలు చేస్తుంది: చెరుకు రసం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కామెర్ల లాంటి వాటి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇది శరీర ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు చెరుకు రసాన్ని తాగాలని సూచిస్తున్నారు.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఈ జ్యూస్‌లో ఉండే పొటాషియం ఉదరంలోని పిహెచ్ స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది. కావున చెరుకు రసం తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. దీనివల్ల ఆహారం తేలికగా జీర్ణమవుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Sunflower Seeds: శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌‌తో బాధపడుతున్నారా..? అయితే.. ఈ గింజలతో చెక్ పెట్టవచ్చు..

Diet Tips: పరగడుపున వీటిని తింటే శరీరంలో పోషకాల లోపం ఎప్పటికీ ఉండదు.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు