Sunflower Seeds: శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌‌తో బాధపడుతున్నారా..? అయితే.. ఈ గింజలతో చెక్ పెట్టవచ్చు..

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో.. దానిని అదుపులో ఉంచుకోవడానికి మంచి జీవనశైలి.. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం చాలా ముఖ్యం.

Sunflower Seeds: శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌‌తో బాధపడుతున్నారా..? అయితే.. ఈ గింజలతో చెక్ పెట్టవచ్చు..
Sunflower
Follow us

|

Updated on: May 09, 2022 | 9:57 AM

Benefits of Sunflower Seeds : ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరంలో అది మరింత తీవ్రమైతే.. గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. మొదటిది మంచి కొవ్వు.. రెండవది చెడు కొవ్వు.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో.. దానిని అదుపులో ఉంచుకోవడానికి మంచి జీవనశైలి.. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం చాలా ముఖ్యం. చాలా సార్లు క్షీణిస్తున్న పరిస్థితుల్లో చాలా మంది ప్రజలు మందుల సహాయంతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటారు. అయితే కొందరు ఇంటి నివారణ చిట్కాలను అవలంబించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను నివారించాలనుకునే వారు పలు హోం రెమెడీస్ అవలంభించాలని సూచిస్తున్నారు నిపుణులు. అయితే.. పొద్దుతిరుగుడు పువ్వు గింజలతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చన్న విషయం మీకు తెలుసా.. ? తెలియకపోతే.. ఈ విత్తనాలను ఎలా ఉపయోగించాలి.. కొవ్వును ఎలా నియంత్రించుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..

పొద్దుతిరుగుడు విత్తనాల్లో.. ఎన్నో పోషకాలు..

వాస్తవానికి ఆయుర్వేదంలో పొద్దుతిరుగుడు విత్తనాలను చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. దీని విత్తనాలు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వంటి అనేక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

పొద్దుతిరుగుడు విత్తనాలను ఎలా తినాలి..

పొద్దుతిరుగుడు విత్తనాలను ఉదయం తినడం ఉత్తమమైనదిగా పేర్కొంటున్నారు నిపుణులు. పొద్దుతిరుగుడు పువ్వుల గింజలను ఓట్స్, గంజి లేదా సలాడ్‌లో కలిపి రోజూ తింటే ప్రయోజనం కలుగుతుంది. ఇదే కాకుండా మీకు కావాలంటే ఈ విత్తనాలను వేయించి తినవచ్చు.

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు..

మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. అన్నింటిలో మొదటిది, మీ దవడలు.. చేతుల్లో నొప్పి ఉంటుంది. ఇది కాకుండా, చెమట ఎక్కువగా ఉంటే దానిని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఇది కూడా దాని లక్షణమే. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Kidney Care Tips: కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ రసం తాగితే వెంటనే చెక్ పెట్టొచ్చు.. 

Health Tips: ఆహారం తిన్న వెంటనే నీరు తాగొచ్చా.. లేదా? అసలు ఎప్పుడు తాగితే మంచిదో తెలుసుకోండి..