AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Problems : చర్మ సమస్యలు వేధిస్తున్నాయా? ఇంట్లోనే ఉండే వాటితో చెక్ పెట్టండిలా..!

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చర్మ సంరక్షణ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించలేకపోవడంతో సమస్య మరింత తీవ్రం అవుతుంది. అయితే సమయం తీసుకుని చర్మ సంరక్షణ కోసం వివిధ జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం ఉండడం లేదని బాధపడుతూ ఉంటారు.

Skin Problems : చర్మ సమస్యలు వేధిస్తున్నాయా? ఇంట్లోనే ఉండే వాటితో చెక్ పెట్టండిలా..!
skin rashes
Nikhil
| Edited By: |

Updated on: Apr 03, 2023 | 6:15 AM

Share

పెరుగుతున్న కాలుష్యం కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా అందరూ వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ కాలుష్యం వల్ల చర్మ సమస్యలు అందరినీ వేధిస్తున్నాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చర్మ సంరక్షణ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించలేకపోవడంతో సమస్య మరింత తీవ్రం అవుతుంది. అయితే సమయం తీసుకుని చర్మ సంరక్షణ కోసం వివిధ జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం ఉండడం లేదని బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా పెదవులు నల్లగా మారడం, నల్లటి అండర్ ఆర్మ్స్ వంటి సమస్యలు అయితే అస్సలు తగ్గవు. కాబట్టి ఈ సమస్యల నుంచి రక్షణకు కొన్ని హ్యాక్స్ పాటిస్తే సరిపోతుందని చర్మ వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మన ఇంట్లోనే ఎప్పుడు ఉండే వాటితో దీర్ఘకాలికంగా ఇబ్బందిపడుతున్న చర్మ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నాయి. అయితే వారు సూచించే హ్యాక్స్ ఏంటో? ఓ సారి చూద్దాం.

అరటిపండు

జీర్ణక్రియకు ఎంతగానో మేలు చేసే అరటిపండు ద్వారా కొన్ని చర్మ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా పగిలిన మడిమల కోసం అరటిపండు దివ్యఔషధంలా ఉంటుంది. మనం తీసి పారేసే అరటి తొక్కను కాళ్లు పగిలిన చోట అప్లయ్ చేసుకుంటే నమ్మలేని ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

నిమ్మకాయ

నల్లటి అండర్ ఆర్మ్స్ నుంచి రక్షణ కోసం నిమ్మకాయను చాలా మంది వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిమ్మకాయను సగం కోసి నల్లటి అండర్ ఆర్మ్స్‌పై అప్లయ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి

పొడి పెదవులు, లేదా పగిలిన పెదవుల సమస్యతో బాధపడుతున్న వారికి వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. తొక్కలు తీసిన వెల్లుల్లిని మనకు నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

టమాటో జ్యూస్

మనం కూరల్లో నిత్యం వాడే టమాటోతో బ్లాక్ హెడ్స్ నుంచి రక్షణ పొందవచ్చు. టమాటోను  మెత్తగా చేసి దాంట్లో నుంచి వచ్చిన రసంతో టీ ట్రీ ఆయిల్‌తో కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో అప్లయ్ చేస్తే వెంటనే సమస్య నుంచి బయటపడవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..