Bad Breath: నోటి దుర్వాసన మిమ్మల్ని వేధిస్తోందా?.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..!

Bad Breath: నోటి దుర్వాసన వల్ల ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఈ పరిస్థితి దారుణంగా ఉంటుంది.

Bad Breath: నోటి దుర్వాసన మిమ్మల్ని వేధిస్తోందా?.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..!
Bad Smell
Follow us

|

Updated on: Jul 01, 2022 | 4:20 PM

Bad Breath: నోటి దుర్వాసన వల్ల ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఈ పరిస్థితి దారుణంగా ఉంటుంది. మాట్లాడేవారితో పాటు.. వారి ఎదురుగా ఉన్న వారు కూడా ఇబ్బందులు పడుతుంటారు. నోటి దుర్వాసన, హాలిటోసిస్ అనేది మన నోటిలోని సూక్ష్మ జీవులు, దంతాలు, చిగుళ్లు, నాలుక మధ్యలో పేరుకున్న ఆహారం కారణంగా వస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం.. నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం, జీర్ణవ్యవస్థ అసమతుల్యత నోటి దుర్వాసనకు మూల కారణం. ఇతర కారణాల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. దుర్వాసన వచ్చే ఆహారాలు వెల్లుల్లి, ఉల్లిపాయ, పెరుగు, టీ, కాఫీ, సోడా, కొన్ని రకాల మందులు, సైనస్ ఇన్ఫెక్షన్, జలుబు, కావిటీస్, ఆల్కహాల్ తీసుకోవడం, ధూమపానం, ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. అయితే, కొన్ని సాధారణ నివారణలు, జీవనశైలిలో మార్పు ద్వారా నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు. ఆయుశక్తి సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ స్మితా నారం నోటి దుర్వాసనకు చెక్ పెట్టేందుకు అవసరమైన చిట్కాలను సూచించారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మంచి ఆహారం.. జీర్ణ వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అనేక అంశాలు మన జీర్ణ వ్యవస్థలోని బ్యాక్టీరియాను ప్రభావితం చేస్తాయి. వాటిలో ఒకటి మనం తినే ఆహారం. పండ్లు, కూరగాయలు, అధిక ఫైబర్ కలిగిన ఆహార పదార్థాలను తినడం వల్ల మీ శరీరం పుష్కలంగా పోషకాహారం, ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్‌లను పొందడానికి సహాయపడుతుంది. ప్రోబయోటిక్స్ తినడం వల్ల మన ప్రేగులలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా ఆరోగ్యకరమైన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. వేయించిన, సంతృప్త కొవ్వు, ఎర్ర మాంసం, ఆహార ఉత్పత్తులను నివారించడం మంచిది. ఎందుకంటే అవి పేగుల్లో చెడు బ్యాక్టీరియాను డెవలప్ చేస్తుంది. అది నోటి దుర్వాసనకు కారణం అవుతుంది.

మార్నింగ్ ఎనర్జీ డ్రింక్.. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు ఈ ఎనర్జీ డ్రింక్ తాగాలి. అర గ్లాసు క్యారెట్ రసం, సగం దానిమ్మ, అర గ్లాసు బీట్‌రూట్ రసం తీసుకోవాలి. 10 బాదంపప్పులు, 5 వాల్‌నట్‌లు, 1 ఒలిచిన యాలకులు, అర టీస్పూన్ మెంతి గింజల పొడి, తాజా పసుపు అర టీస్పూన్, తాజా ఉసిరి 2, లేదా ఉసిరి పొడి ఒక టీస్పూన్ నానబెట్టి స్మూతీ చేసుకుని తాగాలి.

కొన్ని మూలికలను నమలడం ద్వారా.. నోటి దుర్వాసనకు చెక్ పెట్టేందుకు కొన్ని రకాల మూలికలు నోట్లో వేసుకుని నమలాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కొన్ని సోపు గింజలను తీసుకోవచ్చు. లేదా రెండు పుదీనా ఆకులను నోట్లో వేసుకుని నమలవచ్చు. నోటిని తాజాగా ఉంచే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వీటిలో ఉన్నాయి. కొత్తిమీర, పార్స్లీ కూడా అద్భుతమైన ప్రత్యామ్నాయాలు. క్లోరోఫిల్ కారణంగా వచ్చే నోటి దుర్వాసనను దూరం చేసే ఏకైక పరిష్కారాలలో పార్స్లీ ఒకటి.

ప్రతి నెలా టూత్ బ్రష్ మార్చాలి.. మనం ప్రతిరోజూ ఉపయోగించే టూత్ బ్రష్‌లో గరిష్ట బ్యాక్టీరియా ఉంటుంది. అయితే, టూత్ బ్రెష్‌ను ఎక్కువ కాలం వినియోగించకూడదు. నెల రోజులు ఉపయోగించిన తరువాత ఆ టూత్ బ్రష్ ను మార్చేయాలి. ఎక్కువ కాలం వాడటం వల్ల.. ఆ బ్రష్‌లోని బ్యాక్టీరియా నోటిలోకి ప్రవేశించి.. నోటి దుర్వాసనకు కారణం అవుతాయి. అలాగే, టూత్ బ్రష్‌ను ఉపయోగించే ముందు, తర్వాత శుభ్రంగా కడగాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..