AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు సంరక్షణ   ఈ చిట్కాలతో చుండ్రు, హెయిర్‌ ఫాల్‌ దూరం..

Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు సంరక్షణ ఈ చిట్కాలతో చుండ్రు, హెయిర్‌ ఫాల్‌ దూరం..

Anil kumar poka
|

Updated on: Jul 01, 2022 | 5:34 PM

Share

వర్షాకాలం మొదలైంది. వాతావరణంలోని మార్పులు చర్మంతో పాటు జుట్టుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జుట్టు రాలడం, తల దురద పెట్టడం వంటి సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి.


వర్షాకాలం మొదలైంది. వాతావరణంలోని మార్పులు చర్మంతో పాటు జుట్టుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జుట్టు రాలడం, తల దురద పెట్టడం వంటి సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. అందుకే ఈ సీజన్‌లో జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. వర్షాకాలంలో జుట్టు ఎక్కువ తేమగా ఉంటుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే డాండ్రఫ్‌, హెయిర్‌ ఫాల్‌ లాంటి సమస్యలకు దారి తీయవచ్చు. అంతే కాదు, కాలానుగుణంగా ఉండే తేమతో చర్మం కూడా పాడవుతుంది. ఇక జుట్టు రాలడానికి ప్రధాన కారణం చుండ్రు. కాబట్టి ఈ సీజన్‌లో జుట్టు చుండ్రు బారిన పడకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..పెరుగు జుట్టుకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టును మృదువుగా చేయడమే కాకుండా పోషణను కూడా అందిస్తుంది. పెరుగుతో తల దురద, చుండ్రు, పొడి జుట్టు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. షాంపూ చేయడానికి అరగంట ముందు జుట్టుకు పెరుగును అప్లై చేయండి. ఈ పెరుగులో నిమ్మరసం కలిపి కూడా వాడొచ్చు. జుట్టు సంరక్షణకు గుడ్లు కూడా ఎంతో ఉత్తమం. వెంట్రుకలకు బలం చేకూర్చడంతో పాటు కొత్త మెరుపును అందిస్తాయి. ఈ హెయిర్ మాస్క్ చేయడానికి 3 గుడ్లు తీసుకొని వాటిలోని వైట్‌ కంటెంట్‌ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపండి. ఈ రెండు పదార్థాలను బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. అలాగే ఒక గుడ్డులో మూడు టీస్పూన్ల పెరుగు మిక్స్ చేసి అప్లై చేస్తే.. జుట్టు రాలిపోయే సమస్య నుంచి బయటపడవచ్చు. కలబంద అన్ని జుట్టు సమస్యలను తొలగించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వర్షాకాలంలో వెంట్రుకలు రాలిపోయే సమస్యను దూరం చేసుకోవాలంటే నాలుగు టీస్పూన్ల కలబందను కొబ్బరినూనెలో కలిపి ఈ పేస్ట్‌ని జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇది జుట్టు రాలడాన్ని తొలగించడమే కాకుండా, చుండ్రును వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్‌ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..

Published on: Jul 01, 2022 05:34 PM