Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soaked Dates: నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా? తెలిస్తే అసలు వదిలిపెట్టరు

మధుమేహంతో బాధపడే వారికి ఖర్జూరం తీసుకుంటే చాలా మేలు చేస్తుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. నానబెట్టిన ఖర్జూరాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.

Soaked Dates: నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా? తెలిస్తే అసలు వదిలిపెట్టరు
Dates
Follow us
Basha Shek

|

Updated on: Jan 02, 2023 | 10:03 AM

డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాంటి హెల్దీ ఫుడ్స్‌ లో ఖర్జూరాలు కూడా ఒకటి. ముఖ్యంగా నానబెట్టిన ఖర్జూరాలను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇందుకోసం ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం పరగడుపునే వాటిని తినండి. వీటిలో ఫైబర్, విటమిన్లు, ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. మీరు వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే పలు రోగాలు దూరమవుతాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారికి ఖర్జూరం తీసుకుంటే చాలా మేలు చేస్తుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. నానబెట్టిన ఖర్జూరాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. అలాగే రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతుంది.

జ్ఞాపక శక్తి పెరుగుతుంది..

నానబెట్టిన ఖర్జూరాన్ని తీసుకోవడం వల్ల మెదడుకు చాలా మేలు జరుగుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల మనసుకు పదును పెడుతుంది. ఇది మీ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

చర్మానికి మేలు ..

ఖర్జూరంలో చాలా విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా చర్మంపై ముడతలను తొలగించే యాంటీ ఏజింగ్‌ కారకంగా పనిచేస్తుంది.

మలబద్ధకానికి చెక్‌..

ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది అనేక కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది. అందుకే రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరాన్ని తినాలి

ఎముకలను దృఢంగా చేస్తాయి

నానబెట్టిన ఖర్జూరంలో మాంగనీస్, కాపర్, సెలీనియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఇవి పనిచేస్తాయి. అలాగే ఎముకలకు సంబంధించిన పలు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.

రోజంతా ఎనర్జీగా..

నానబెట్టిన ఖర్జూరాలను తినడం ద్వారా, మీరు రోజంతా ఎనర్జీగా ఉంటారు. ఇవి అలసట, బలహీనతను తొలగిస్తాయి. అలాగే శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి