Fenugreek Water: మెంతి నీటితో ఆరోగ్య ప్రయోజనాలు మెండు.. అద్భుత ప్రయోజనాలు తెలిస్తే..

మెంతుల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్‌ -సి,బి1,బి2, కాల్షియం అధికంగా ఉంటాయి. మెంతి గింజలలో మసిలేజ్ అనే మూలకం ఉంది.

Fenugreek Water: మెంతి నీటితో ఆరోగ్య ప్రయోజనాలు మెండు.. అద్భుత ప్రయోజనాలు తెలిస్తే..
Methi Seeds Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 02, 2023 | 9:41 AM

మెంతులు.. వంటింట్లో ఉండే ఔషధగని. పచ్చళ్లు, పుసులులు, పోపుల్లో ఎక్కువగా వాడుతుంటారు. వాటిని డైరెక్టుగా వాడినా, నానబెట్టి వాడినా, మెలకల రూపంలో తీసుకున్నా… పొడి చేసి వాడిన కూడా మెంతులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. మెంతుల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్‌ -సి,బి1,బి2, కాల్షియం అధికంగా ఉంటాయి. మెంతులు చర్మం మెరిసేలా చేయడంలో, జట్టు పెరిగేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉదయం పరగడుపున మెంతి గింజల నీటిని తాగడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది. మెంతి నీరు ఊబకాయాన్ని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మెంతులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కూడా తగ్గిస్తాయి. ఇది డయాబెటిస్ రోగులకు ఇది గొప్ప వరం లాంటింది. మెంతి గింజల నీటిని ఖాళీ కడుపుతో తాగితే.. అది షుగర్‌ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. మెంతి గింజలలో మసిలేజ్ అనే మూలకం ఉంది. ఒక చెంచా మెంతి గింజలను ఒక కప్పు నీటిలో మరిగించాలి. ఆ నీరు సగం వరకు వచ్చిన తర్వాత వడకాచుకొని తాగాలి. ఆ నీరు తాగితే జలుబు, దగ్గు సమస్యలు తగ్గిపోతాయి. మెంతి నీరు చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది స్కిన్ అలర్జీ సమస్యను దూరం చేస్తుంది. గోరు మొటిమల సమస్యను కూడా తొలగిస్తుంది. ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

మెంతుల్ని నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. నెలపాటు క్రమం తప్పకుండా మెంతి నీటిని తీసుకుంటే.. హెచ్‌డిఎల్ అనే మంచి కొలెస్ట్రాల్ శరీరంలో పెరుగుతుంది. ఇది శరీరానికి ఎంతో మంచిది. అజీర్ణం, మలబద్ధకంతో బాధపడేవారికి మెంతి నీరు చాలా మేలు చేస్తుంది. మెంతికూరలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్‌లు ప్యాంక్రియాస్‌ను యాక్టివ్‌గా చేస్తాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తద్వారా జీర్ణక్రియను మెరుగుపడుతుంది. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా నూరి జుట్టు కుదుళ్లకు రాసుకుంటే జుట్టు రాలడం ఆగి మెరుపు వస్తుంది. జుట్టు కూడా బలంగా తయారవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!