AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice Husk Powder: ఈ పిండి అందరూ వేస్ట్ అనుకుంటారు.. కానీ ఎన్ని పోషకాలు, విటమిన్లు ఉన్నాయో!!

ఇప్పుడు అందరూ పాలిష్ పట్టిన బియ్యాన్నే ఎక్కువగా వాడుతున్నారు. కానీ మన పూర్వీకులు ఒకసారి పొట్టుతీసిన ధాన్యాన్నే వండుకుని తినేవారు. అందుకే ఆ కాలం మనుషులు ఇప్పటికీ దృఢంగా ఉంటారు. బియ్యం పాలిష్ పట్టగా వచ్చే పిండిని తవుడు అంటాం. సాధారణంగా ఈ తవుడును..

Rice Husk Powder: ఈ పిండి అందరూ వేస్ట్ అనుకుంటారు.. కానీ ఎన్ని పోషకాలు, విటమిన్లు ఉన్నాయో!!
Rice Husk Powder
Chinni Enni
|

Updated on: Jul 27, 2023 | 9:44 PM

Share

ఇప్పుడు అందరూ పాలిష్ పట్టిన బియ్యాన్నే ఎక్కువగా వాడుతున్నారు. కానీ మన పూర్వీకులు ఒకసారి పొట్టుతీసిన ధాన్యాన్నే వండుకుని తినేవారు. అందుకే ఆ కాలం మనుషులు ఇప్పటికీ దృఢంగా ఉంటారు. బియ్యం పాలిష్ పట్టగా వచ్చే పిండిని తవుడు అంటాం. సాధారణంగా ఈ తవుడును పశువులకు ఆహారంగా పెడుతుంటారు. ఇది పశువులే కాదు.. మనుషులు కూడా తినొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్లతో పాటు.. శరీరానికి అవసరమయ్యే ఎన్నోరకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. 344 మందిపై 6 నెలలపాటు ఇరాన్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.

-ప్రతిరోజూ 2 నుంచి 3 స్పూన్ల తవుడు తీసుకోవడం వల్ల శరీరంలో 40 శాతం మేర ఆక్సిడెంట్లు పెరుగుతాయి. అలాగే ఫ్రీ రాడికల్స్ నశిస్తాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన కూడా పడకుండా కాపాడుతాయి.

-తవుడులో ఉండే గామా ఒరైజనాల్ అనే రసాయన సమ్మేళనం శరీరంలో ఇన్ ప్లామేషన్ ను పెంచే ఎంజైమ్ లను నశింపజేయడంలో సహాయపడుతుంది. తవుడులో ఉండే ఫైబర్ వల్ల మంచి బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

-అలాగే విటమిన్ B1, B2, B3, B5, B6, B7,B9, B12 వంటి బి కాంప్లెక్స్ విటమిన్లన్నీ శరీరానికి లభిస్తాయి.

-100 గ్రాముల తవుడులో 45 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది కాబట్టి.. ఐరన్ లోపం, రక్తహీనత వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

-శరీరానికి కావలసిన ప్రొటీన్, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

-తవుడును నేరుగా తినొచ్చు లేదంటే.. చపాతీ పిండిలో కలుపుకుని తినొచ్చు. మినుములతో చేసే సున్నుండల్లోనూ తవుడును కలిపి చేసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి