AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Protection Tips: భారత్‌లో పెరుగుతున్న ఎండలు.. చర్మ సౌందర్య రక్షణకు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల చర్మం ముడతలు పడడమే కాకుండా ఎన్నో ఇతర సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో చర్మం ఎండబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Skin Protection Tips: భారత్‌లో పెరుగుతున్న ఎండలు.. చర్మ సౌందర్య రక్షణకు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!
అధిక ఒత్తిడి జుట్టు రాలడంతో పాటు చర్మంపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా ఒత్తిడికి గురికాకుండా ఉండండి. తగినంత నీరు త్రాగాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా చేయటం అలవాటుగా చేసుకోండి.
Nikhil
|

Updated on: Feb 21, 2023 | 10:45 AM

Share

శివరాత్రి వెళ్లిపోతే శివశివ అంటూ చలి వెళ్లిపోతుందనే అనే నానుడి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అంటే శివరాత్రి తర్వాత ఎండలు క్రమేపి పెరుగుతాయని అని అర్థం. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఎండలకు మొదటగా ప్రభావితమయ్యేది చర్మమే. సూర్యరశ్మికి గురైత చర్మం ధీర్ఘకాలిక సమస్యలకు గురవుతుంది. మన చర్మం ముడతల పడడానికి 90 శాతం కారణం సూర్యరశ్మి అని చాలా మందికి తెలియదు. సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల చర్మం ముడతలు పడడమే కాకుండా ఎన్నో ఇతర సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో చర్మం ఎండబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే వేసవి కాలంలో చర్మ సమస్యల నుంచి రక్షణ దొరుకుందని పేర్కొంటున్నారు. అయితే వేసవికాలంలో చర్మ రక్షణకు  సన్‌స్క్రీన్ రాయడం ఓ మంచి పద్ధతైతే ఆహారం కూడా మంచి శరీరాన్ని అందిస్తుందనే విషయాన్ని గమనించాలంటున్నారు. చర్మరక్షణకు వారు సూచించే ఆహారం పదార్థాలేంటో? ఓ సారి తెలుసుకుందాం.

బాదం పప్పు

బాదం పప్పులో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. బాదంపప్పును తింటే యూవీబీ కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు. బాదంపప్పులో విటమిన్ – ఈ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ సాధారణ ఆహారంతో దాదాపు ఓ 20 బాదం పప్పులు తింటే శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు చర్మ రక్షణకు సాయపడుతుంది.

పచ్చటి ఆకు కూరలు

ముదురు ఆకు పచ్చగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు మీరు రోజూ తీసుకుంటే శరీరానికి అవసరమైన బీటా కెరోటిన్ అందుతుంది. తద్వార యూవీ కిరణాల వచ్చే నష్టాన్ని నివారించడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా శరీరానికి అందుతాయి. అలాగే చర్మానికి అవసరమైన విటమిన్ – ఈ అందుతుంది. లుటీన్ వంటి యాంటీ ఆక్సిడెండ్ల ద్వారా చర్మ ముడతలు పడకుండా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

సిట్రస్ పండ్లు 

సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది యూవీ కిరణాలు కాలుష్యాన్ని నిరోధించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, విటమిన్ సి- అధికంగా ఉండే ఆహార పదార్థాలు. చర్మం వృద్ధాప్యానికి కారణమయ్యే సూర్యుడి నుండి ప్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. విటమిన్ సి పండ్లను దీర్ఘకాలిక తీసుకుంటే వడదెబ్బ వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలు, కివి, నారింజ, ద్రాక్షపండు మరెన్నో సిట్రస్ పండ్లలో లైకోపీన్ అనే వర్ణద్రవ్యం దాని ఫోటోప్రొటెక్టివ్ ప్రయోజనాలకు కూడా ప్రసిద్ధి చెందింది. లైకోపీన్ మీ చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడడంలో చాలా బాగా సాయం చేస్తుంది. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి