Summer Skin Care: ఇంట్లోనే ఐస్ క్యూబ్స్ ఫేషియల్.. ఎండాకాలంలో చేస్తే చర్మ సమస్యలకు చెక్..
వేసవిలో చర్మ సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ సీజన్లో చల్లటి నీటితో ముఖాన్ని ఎక్కువగా శుభ్రం చేస్తుంటారు. మండే ఎండలు, చెమటలు పట్టి

వేసవిలో చర్మ సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ సీజన్లో చల్లటి నీటితో ముఖాన్ని ఎక్కువగా శుభ్రం చేస్తుంటారు. మండే ఎండలు, చెమటలు పట్టి ఇంటికి చేరుకోగానే మొదటగా ముఖం చల్లటి నీళ్లతో కడుక్కోవడానికి ఇష్టపడుతుంటారు. చల్లని నీటితో ముఖాన్ని కడగడం వలన చర్మ సమస్యలు తగ్గిపోతాయి (Summer Skin Care). ఐస్ వాటర్‌తో ముఖం కడుక్కొని, ఐస్‌ను ముఖంపై రుద్దితే చర్మానికి అనేక ప్రయోజనాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ఐస్ వాటర్ ఫేషియల్ వేసవిలో అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.. ఐస్ వాటర్ ఫేషియల్ చేసుకోవడానికి స్పాకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సులభంగా చేయవచ్చు. అందుకు కావాల్సిన పద్దతులు తెలుసుకుందామా.
ఐస్ వాటర్ ఫేషియల్ ఎలా చేయాలి ముందుగా పెద్ద గిన్నెలో ఐస్ వాటర్ నింపాలి. ఆ తర్వాత మీ ముఖాన్ని అందులో సుమారు 30 సెకన్ల పాటు ముంచండి. ఇప్పుడు మీ ముఖాన్ని బయటకు తీసి మెత్తటి కాటన్ క్లాత్‌తో ఆరనివ్వండి. తర్వా ముఖాన్ని సాధారణ నీటితో కడగాలి. ముఖం పై ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత మళ్లీ ఐస్ వాటర్‌లో ముఖాన్ని ముంచి 30 సెకన్ల పాటు ఉంచండి. ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు చేయాలి. లేదంటే ఐస్ క్యూబ్స్‌ను మెత్తని కాటన్ వస్త్రంలో చుట్టి ముఖంపై వృత్తాకారంలో రాస్తూ ఉండాలి.
ప్రయోజనాలు.. 1. ఐస్ వాటర్ ఫేషియల్ ఉదయం పూట చేస్తే, అది కళ్ళు, ముఖం వాపును తగ్గిస్తుంది. 2. ఐస్ వాటర్ చర్మ రంధ్రాలను ఒపెన్ చేస్తుంది. తర్వాత ఏదైనా చర్మ సంరక్షణ ఉత్పత్తి చర్మంలోకి వెళ్తుంది. 3. ఐస్ వాటర్ ఫేషియల్ మొటిమలు, బ్రేకవుట్‌లను తగ్గించడంలో సహాయపడుతుంది. 4. ఐస్ వాటర్ ఫేషియల్ ముఖంపై నూనె ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. 5. ఐస్ వాటర్ ఫేషియల్ చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. రోసేసియా వంటి అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. 6. డార్క్ సర్కిల్స్ సమస్యను క్రమంగా తగ్గిస్తుంది.
Also Read: Darja Teaser: దర్జా టీజర్ రిలీజ్.. చీరకట్టిన సివంగిగా మరోసారి అదరగొట్టిన అనసూయ..
Nagarjuna: శరవేగంగా ది ఘోస్ట్.. దుబాయ్‌లో కీలక షెడ్యూల్ పూర్తి చేసిన నాగార్జున అండ్ టీం..
Swimming Benefits: స్విమ్మింగ్ చేస్తే బరువు తగ్గుతారా ?.. ఈ టిప్స్ ఫాలో అయితే ఖాయమంటున్న నిపుణులు..




