AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: చర్మానికి పసుపును రాస్తున్నారా?.. అయితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..

Beauty Tips: ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరూ తమ ముఖం, జుట్టు పరిరక్షణకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతారు.

Skin Care Tips: చర్మానికి పసుపును రాస్తున్నారా?.. అయితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..
Turmeric
Shiva Prajapati
|

Updated on: Jul 27, 2021 | 9:26 PM

Share

Beauty Tips: ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరూ తమ ముఖం, జుట్టు పరిరక్షణకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతారు. స్కిన్‌కేర్ సెంటర్లకు, హెయిర్ క్లీనిక్ సెంటర్లకు తిరుగుతుంటారు. ఇందుకోసం వేలాది రూపాయలను ఖర్చు చేస్తుంటారు. ఇలా అనవసరంగా డబ్బును వృథా చేయడానికి బదులుగా.. కేవలం వంటింట్లో సహజసిద్ధంగా లభించే కొన్ని పదార్థాలతోనే ఆరోగ్యకరమైన, అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే జుట్టును సంరక్షించుకోవచ్చు. ముఖారవిందాన్ని పెంచే పదార్థాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే.. పసుపు కీలకం అని చెప్పుకోవాలి. ఇది వంటల్లో ఎంతటి రుచిని కలిగిస్తుందో.. అలాగే చర్మ సమస్యలను తొలగించడంలోనూ ఉపయోగపడుతుంది. ఇది తెలిసిన పలువురు తమ ముఖానికి పసుపును అప్లై చేస్తుంటారు. అయితే, ఇలా అప్లై చేయడంలోనే పొరపాటు చేస్తుంటారు. దాని వల్ల ముఖ చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది. మరి ఆ సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అనవసరమైన వస్తువులను కలపడం వల్ల.. ముఖారవిందాన్ని పెంచడంతో పసుపు అద్భుతంగా పని చేస్తుంది. కానీ కొందరు దానికి అదనంగా ఏవేవో మిక్స్ చేస్తుంటారు. ఎక్కువగా పసుపును రోజ్ వాటర్, పాలు, నీటితో కలుపుతారు. కానీ కొందరు అనవసరమైన పదార్థాలను పసుపుకు జత చేస్తారు. ఫలితంగా ముఖ చర్మం దెబ్బతింటుంది. అందుకే పసుపుతో ఏది పడితే అది కలుపకూడదు.

ముఖం మీద ఎక్కువసేపు ఉంచాలి.. పసుపు మీ చర్మానికి మేలు చేస్తుంది. పసుపు పేస్ట్ ముఖానికి అప్లై చేయడం ద్వారా ముఖం లేత పసుపు రంగులో కనిపిస్తుంటుంది. అందుకే.. ముఖానికి పసుపు పేస్ట్ ఎంతసేపు ఉంచుకోవాలనే దానిపై దృష్టి పెట్టాలి. 20 నిమిషాల కన్నా ఎక్కువ సేపు ఈ ప్యాక్‌ను ఉంచొద్దు. పసుపును ఎక్కువసేపు ముఖంపై ఉంచితే.. దాని రంగు అలాగే ముఖానికి అంటుకుంటుంది. అందుకని.. 20 నిమిషాల తరువాత వెంటనే కడిగేయాలి. అంతేకాదు.. పసుపును అధిక పరిమాణంలో ముఖానికి పూయడం వల్ల మొటిమలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.. బిజీగా ఉండే జీవనశైలి కారణంగా చాలా మంది తమ చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోరు. చర్మ సంరక్షణ కోసం ప్రతిరోజూ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముఖ్యంగా పసుపు పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసిన తరువాత.. ముఖాన్ని చల్లటి నీరు లేదా గది ఉష్ణోగ్రత నీటితో కడగాలి. పసుపు పేస్ట్ ముఖానికి పెట్టి కడిగిన తరువాత.. తేలికపాటి మాయిశ్చరైజర్‌ను వాడాలి.

సబ్బు వాడండి.. ఫేస్ ప్యాక్ వేసిన తరువాత చాలా మంది ముఖాన్ని సబ్బుతో కడుగుతారు. అలాంటి తప్పు చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. పసుపు ఫేస్ ప్యాక్ తొలగించిన తరువాత.. 24 గంటల నుంచి 48 గంటల వరకు సబ్బును వాడకూడదని చెబుతున్నారు.

ఫేస్‌ప్యాక్‌ని సరిగ్గా అప్లై చేయాలి.. చాలా మంది తొందరలో పసుపు ఫేస్ ప్యాక్‌ను ముఖానికి సరిగా అప్లై చేయరు. ఇలాంటి తప్పులను సరిచేసుకోవాలి. సరిగ్గా అప్లై చేయకపోతే.. పసుపు పెట్టినా ఉపయోగం ఉండదు. పసుపు పేస్ట్‌ని సరిగా అప్లై చేయకపోతే.. ప్యాచెస్ కనిపిస్తాయి. అక్కడక్కడ మరకల మాదిరిగా కనిపిస్తుంటాయి. అందుకే ఇలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్త పడండి.

Also read:

Health Tips: గర్భిణీ స్త్రీలకు ముఖ్య గమనిక.. బీపీ తక్కువ అవుతుందా.. అయితే వీటితో ఉపశమనం పొందండి..

Snake Plant: ఇంటి ఆవరణలో ఈ మొక్కను నాటండి.. అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది..

Viral Video: వామ్మో ఇదేం కొట్టుకోవడం.. పొట్టు పొట్టుగా తన్నుకున్న యువతులు.. నెట్టింట్లో వీడియో హల్‌చల్..