Snake Plant: ఇంటి ఆవరణలో ఈ మొక్కను నాటండి.. అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Jul 27, 2021 | 9:13 PM

Snake Plant: ప్రతీ మొక్క, ప్రతీ చెట్టు ఏదో రకంగా మానవాళికి ఉపయోగపడుతూనే ఉంటాయి. ప్రతీ మొక్కలు ఒక దివ్య ఔషధ గుణాలు దాగి ఉంటాయి.

Snake Plant: ఇంటి ఆవరణలో ఈ మొక్కను నాటండి.. అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది..
Snake Plant

Follow us on

Snake Plant: ప్రతీ మొక్క, ప్రతీ చెట్టు ఏదో రకంగా మానవాళికి ఉపయోగపడుతూనే ఉంటాయి. ప్రతీ మొక్కలు ఒక దివ్య ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఈ విషయాన్ని వేదకాలం మొదలు.. ప్రస్తుత వైద్య నిపుణుల వరకు అందరూ నొక్కి వక్కాణిస్తుంటారు. కొన్ని మొక్కల్లో ఉండే ఔషధ లక్షణాలు మనుషులను వ్యాధుల నుంచి దూరం చేస్తాయని, అనేక రకాలుగా ఉపయుక్తంగా ఉంటాయని చెబుతుంటారు. వాటిలో ముఖ్యంగా స్నేక్ ప్లాంట్‌ను చెప్పుకోవచ్చు. దీనిని సాన్సేవిరియా ట్రైఫాసియాటా అని కూడా పిలుస్తారు.

ఈ మొక్క ఆకులు నిటారుగా పెరుగాయి. చూడటానికి పాము లా కనిపిస్తుంటాయి. అందుకే దీనిని స్నేక్ ప్లాంట్ అంటుంటారు. అయితే ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకుంటే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే చాలా మంది ఈ మొక్కను తమ తమ ఇళ్లలో పెట్టుకునేందుకు అసక్తి కనబరుస్తారు. ఈ ప్లాంట్ ఇంట్లో ఉంటే.. ప్రతికూల శక్తులు రావని, ఇతర అనేక ప్రయోజనాలు ఉంటాయని ప్రజల విశ్వాసం. అయితే, శాస్త్రీయంగా కూడా దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిరూపితం అయ్యింది. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సహజ వాయు శుద్దీకరణ.. ఈ స్నేక్ ట్రీ.. గాలిని శుద్ధి చేస్తుంది. అనేక అధ్యయనాల్లో ఈ విషయం నిరూపితం అయ్యింది. అంతేకాదు.. గాలిలో ఉన్న తేమను ఇది తగ్గిస్తుంది. దీని వల్ల ఎయిర్‌బోన్ ఎలర్జీ కూడా తగ్గుతుంది. ఈ మొక్క జిలీన్, టోలున్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హానీకరమైన వాటిని నియంత్రిస్తుంది. రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్‌ను ఆక్సీజన్‌గా మార్చగల సామర్థ్యం దీనికి ఉంది.

యాంటీ క్యాన్సర్ ప్లాంట్.. ఈ స్నేక్ ప్లాంట్.. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ మొక్క గాలిలో ఉన్న విష పదార్థాలను, క్యాన్సర్‌కు కారణమయ్యే ఏజెంట్లను గ్రహిస్తుంది. ఇళ్లలో ఈ స్నేక్ ప్లాంట్‌ను ఉంచినట్లయితే.. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి రక్షించుకోవడానికి సహాయపడుతుంది.

స్నేక్ ప్లాంట్ నిర్వహణ చాలా సులభం.. ఈ మొక్కను పెంచడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఇది ఎండ, నీడ ఎక్కడైనా బతుకుతుంది. అంతేకాదు.. దీనికి పెద్దగా నీరు కూడా అవసరం లేదు. అయితే, అవసరమైన దానికంటే ఎక్కువ నీరు పోస్తే మాత్రం అది చనిపోయే ప్రమాదం ఉంది. రెండు, మూడు వారాలకు ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది. శీతాకాలంలో దీనికి తక్కువ నీరు పోయాలి. ఈ సమయంలో నెలకు ఒకసారి నీరు పోసినా సరిపోతుంది. ఈ స్నేక్ ప్లాంట్ ఆకులపై దుమ్ము, దూళి ఉంటే శుభ్రం చేస్తుండాలి.

Also read:

Viral Video: వామ్మో ఇదేం కొట్టుకోవడం.. పొట్టు పొట్టుగా తన్నుకున్న యువతులు.. నెట్టింట్లో వీడియో హల్‌చల్..

MLA Shankar Naik: అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం.. ఏకంగా పోడు భూముల వద్ద కాపాలాగా..

Telangana Corona Updates: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఈ సారి జిల్లాల్లో అత్యధికంగా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu