AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Shankar Naik: అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం.. ఏకంగా పోడు భూముల వద్ద కాపాలాగా..

MLA Shankar Naik: మహబూబాబాద్ జిల్లాలో పోడు వ్యవసాయంపై వివాదం మరింత ముదురుతోంది. అధికారుల తీరును నిరసిస్తూ ఏకంగా ఎమ్మెల్యేనే...

MLA Shankar Naik: అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం.. ఏకంగా పోడు భూముల వద్ద కాపాలాగా..
Mla Shankar Naik
Shiva Prajapati
|

Updated on: Jul 27, 2021 | 9:00 PM

Share

MLA Shankar Naik: మహబూబాబాద్ జిల్లాలో పోడు వ్యవసాయంపై వివాదం మరింత ముదురుతోంది. అధికారుల తీరును నిరసిస్తూ ఏకంగా ఎమ్మెల్యేనే రంగంలోకి దిగారు. పోడు రైతులకు మద్దతుగా నిలిచారు. పోడు భూముల వద్దకు వచ్చి గట్టుపై కూర్చున్నారు. రైతులకు కాపలాగా నేనున్నానంటూ ప్రకటించారు. వివరాల్లోకెళితే.. మహాబూబాబాద్ జిల్లాలో పోడు రైతులకు, అటవీశాఖ అధికారులకు మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. అధికారులు, రైతుల మధ్య నిత్యం ఏదో ఒక ఘర్షణ చోటుచేసుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులకు మద్ధతుగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ ముందుకు వచ్చారు. ఏకంగా పోడు రైతులకు మద్దతుగా పోడు భూముల గట్టుపై కూర్చున్నారు.

మంగళవారం నాడు గూడూరు మండలం బొల్లెపెల్లిలో పర్యటించిన ఆయన.. పోడు రైతులకు బాసటగా నిలిచారు. పోడు భూముల గట్టుపై కాపలాగా కూర్చున్నారు. ఎవరు వస్తారో చూస్తానంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి రైతులకు స్వయంగా గోరుముద్దలు తినిపించారు. వారికి అండగా తాను ఉన్నానంటూ ప్రకటించారు. రైతులు.. అధికారుల కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని, కాలర్ ఎగరేసుకుని బ్రతకాలని భరోసా ఇచ్చారు. పోడు భూముల వ్యవహారంలో అటవీ అధికారులు సంయమనం పాటిస్తే బాగుంటుందని హితవు చెప్పారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. రైతుల తరఫున దండం పెట్టి చెబుతున్నానని, పోడుల భూముల జోలికి వెళ్లి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావొద్దంటూ అధికారులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు.

Also read:

Telangana Corona Updates: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఈ సారి జిల్లాల్లో అత్యధికంగా..

AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు ఇష్యూపై మరో కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్..

Amy Jackson: అమీ జాక్సన్ చేసిన పనికి అభిమానులు షాక్.. అసలేం జరిగిందంటూ ఆరా..