AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: గర్భిణీ స్త్రీలకు ముఖ్య గమనిక.. బీపీ తక్కువ అవుతుందా.. అయితే వీటితో ఉపశమనం పొందండి..

Pregnancy Child Care: మహిళలు గర్భవతిగా ఉన్న సమయంలో శరీరంలో రక్తపోటు స్థాయిలు తగ్గడం సర్వసాధారణం. దీని ప్రభావం గర్భిణీ..

Health Tips: గర్భిణీ స్త్రీలకు ముఖ్య గమనిక.. బీపీ తక్కువ అవుతుందా.. అయితే వీటితో ఉపశమనం పొందండి..
Pregnant
Shiva Prajapati
|

Updated on: Jul 27, 2021 | 9:23 PM

Share

Pregnancy Child Care: మహిళలు గర్భవతిగా ఉన్న సమయంలో శరీరంలో రక్తపోటు స్థాయిలు తగ్గడం సర్వసాధారణం. దీని ప్రభావం గర్భిణీ స్త్రీల పట్ల భిన్నంగా కనిపిస్తుంటుంది. అయితే, చాలామంది గర్భిణీ స్త్రీలలో దీని ప్రభావం పెద్దగా కనిపించదు. వారు ప్రసవించిన తరువాత తపరిస్థితి సాధారణ స్థితికి చేరుతుంది. మరికొందరు స్త్రీలలో మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. తక్కువ బ్లడ్ ప్రెజర్ వల్ల కొందరు గర్భిణీలకు ప్రాణాంతకంగా మారుతుంది. అదే సమయంలో వారి బిడ్డకు కూడా ప్రాణాపాయమే అవుతుంది. అందుకే గర్భధారణ సమయంలో బీపీ తక్కువగా ఉన్నట్లయితే.. దానిని సాధారణ స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నించాలి.

సాధారణంగా, ఈ సమస్య ఆరు నెలల గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు బ్లడ్ ప్రజర్స్‌ను చెక్ చేస్తూ ఉండాలి. ఈ సమస్య దాదాపు 24 వ వారం వరకు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య ఉత్పన్నమయ్యే వారిలో మత్తుగా ఉండటం, తల భారంగా ఉండటం, వాంతులు, అలసట, తరచుగా దప్పికవడం, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. అయితే, ఇంత ప్రమాదకరమైన బీపీని వంటింట్లో మనం నిత్యం వాడే వస్తువులతోనే సాధారణ స్థితికి తీసుకురావొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

నిమ్మకాయ, ఉప్పు నీరు.. సోడియం ఉప్పులో అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది బీపీని పెంచడానికి ఉపకరిస్తుంది. బీపీ తక్కువగా ఉన్నప్పుడు, స్త్రీకి నిమ్మకాయ రసం, ఉప్పు వేసి సగం గ్లాసు నీరు తాగించాలి. తద్వారా చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది.

నానబెట్టిన ఎండుద్రాక్ష గర్భిణీల్లో తరచుగా బీపీ తగ్గుతున్నట్లయితే.. ఈ సమస్య నుండి బయటపడటానికి ఎండుద్రాక్షను రాత్రిపూట నీటిలో నానబెట్టి.. ఉదయం సమయంలో తినాలి. ఆ తరువాత అవి నానబెట్టిన నీటిని తాగాలి. ప్రతి రోజూ ఇలా చేయడం ద్వారా బీపీ సాధారణ స్థితిలోకి వస్తుంది. అలాగే హిమోగ్లోబిన్ స్థాయి కూడా మెరుగవుతుంది.

కాఫీ తాగాలి.. బీపీ తక్కువ ఉన్న వారు కాఫీ తాగడం వల్ల చాలా ప్రయోజనం చేకూరుతుంది. రక్తపోటు చాలా వరకు నియంత్రణలోకి వస్తుంది. తక్షణ నివారణిగా గర్భిణీ స్త్రీలు కాఫీ తాగడం ఉత్తమం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అల్లం రసం.. అల్లం.. సాగోల్, జింజెరోల్, జింజెరోన్ వంటి పదార్ధాలను కలిగి ఉంటుంది. ఇది అధిక, తక్కువ బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు అల్లంను నీటిలో ఉడకబెట్టి, ఆ నీటిలో తేనె వేసి తాగొచ్చు. లేదా.. తేనెతో అర టీస్పూన్ అల్లం రసం మిక్స్ చేసుకుని తాగవచ్చు.

గమనిక: గర్భధారణ సమయంలో ఏదైనా వంటింటి చిక్కాలు పాటించే ముందు ఒకసారి నిపుణుడిని సంప్రదించండి. తద్వారా తల్లి, బిడ్డకు ఎలాంటి హానీ జరుగదు.

Also read:

Viral Video: వామ్మో ఇదేం కొట్టుకోవడం.. పొట్టు పొట్టుగా తన్నుకున్న యువతులు.. నెట్టింట్లో వీడియో హల్‌చల్..

MLA Shankar Naik: అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం.. ఏకంగా పోడు భూముల వద్ద కాపాలాగా..

Telangana Corona Updates: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఈ సారి జిల్లాల్లో అత్యధికంగా..