AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో ఇదేం కొట్టుకోవడం.. పొట్టు పొట్టుగా తన్నుకున్న యువతులు.. నెట్టింట్లో వీడియో హల్‌చల్..

Viral Video: మనుషుల మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యువకులు, గ్యాంగ్ వార్‌లు..

Viral Video: వామ్మో ఇదేం కొట్టుకోవడం.. పొట్టు పొట్టుగా తన్నుకున్న యువతులు.. నెట్టింట్లో వీడియో హల్‌చల్..
Girls Fighting
Shiva Prajapati
|

Updated on: Jul 27, 2021 | 9:08 PM

Share

Viral Video: మనుషుల మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యువకులు, గ్యాంగ్ వార్‌లు, తాగుబోతుల కొట్లాట, నీటి కుళాయిల వద్ద మహిళల పోరాటాలు వంటి అనేక రకాల వీడియోలు నిత్యం మనం చూస్తూనే ఉంటాము. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటి వరకూ యువకుల తన్లాటకు సంబంధించిన వీడియోలే మీరు చూసుంటే.. ఇప్పుడ యువతుల కొట్లాటకు సంబంధించి వీడియోను చూసేయండి. అవును.. ఈవీడియోలో ఇద్దరు అమ్మాయిల నడి వీధిలో పొట్టు పొట్టుగా కొట్టుకుంటున్నారు. ఓ రేంజ్‌లో తన్నుకుంటున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో ఒక వీధిలో కొంతమంది యువతులు నిలుచుని ఉన్నారు. వీరిలో ఇద్దరు యువతులు అకస్మాత్తుగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. జుట్లు జుట్లు పీక్కుంటూ దారుణంగా కొట్టుకున్నారు. వారు అంతలా కొట్టుకుంటున్నప్పటికీ పక్కనున్న యువతులు మాత్రం ప్రేక్షపాత్ర పోషిస్తున్నారు. వారిని అలాగే చూస్తూ ఉండిపోయారు. ఒక అమ్మాయి మాత్రం పోలీసులను పిలవాలని చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. వీరి కొట్లాటకు కారణమేంటో తెలియదు గానీ.. ఈ యువతుల కొట్లాను వీడియో తీసి.. ఆ వీడియోను కైంట్ గాల్‌బాట్ అనే ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పక్కన నిల్చున్న వారి తీరుపై మండిపడుతున్నారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన 14 గంటల వ్యవధిలోనే 4.5 లక్షల మందికిపైగా నెటిజన్లు వీక్షించారు. ఇక లైక్స్ కూడా అంతేస్థాయిలో వచ్చాయి. మరి ఈ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

View this post on Instagram

A post shared by @kaintgalbaatt

Also read:

MLA Shankar Naik: అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం.. ఏకంగా పోడు భూముల వద్ద కాపాలాగా..

Telangana Corona Updates: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఈ సారి జిల్లాల్లో అత్యధికంగా..

AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు ఇష్యూపై మరో కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్..