Healthy Diet: నిద్ర లేమితో బాధపడుతున్నారా?.. మంచి నిద్రకోసం ఈ ఆహార పదార్థాలను తినండి..
Healthy Diet: నిద్ర లేకపోవడం ఒక సాధారణ సమస్య. ఒత్తిడి, అసాధారణ జీవనశైలి నిద్రలేమికి ప్రధాన కారణాలు. అయితే, నిద్ర పోవడం కోసం చాలా
Healthy Diet: నిద్ర లేకపోవడం ఒక సాధారణ సమస్య. ఒత్తిడి, అసాధారణ జీవనశైలి నిద్రలేమికి ప్రధాన కారణాలు. అయితే, నిద్ర పోవడం కోసం చాలా మంది స్లీపింగ్ టాబ్లెట్స్‌ని ఆశ్రయిస్తుంటారు. అయితే, ఈ టాబ్లెట్స్ అన్నివేళలా ఉపయుక్తం కాదు.. పైగా ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. దీనికి బదులుగా.. తినే ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం ద్వారా మంచి నిద్ర పడుతుంది. మంచి నిద్ర రావడం కోసం ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గసగసాల పాలు.. నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్న వారికి గసగసాల టీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ టీ ని గసగసాలు, వేడి పాలతో తయారు చేస్తారు. నిద్ర లేమితో బాధపడేవారు దీనిని తీసుకోవచ్చు. నిద్రపోయే ముందు వెచ్చని పాలు తాగడం ద్వారా కడుపును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే గసగసాలు మనసులోని గందరగోళాన్ని తొలగించి శాంతపరుస్తుంది. అలా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫలితంగా గాఢ నిద్రకు ప్రేరేపిస్తుంది. నిద్ర పోవడానికి 30 నుంచి 40 నిమిషాల ముందు ప్రతి రోజూ క్రమం తప్పకుండా తాగాలి.
చమోమైల్ టీ.. నిద్రపోయే ముందు చమోమైల్ టీ ని తాగొచ్చు. ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. మనసులోని ఆందోళనలను తొలగిస్తుంది. తద్వారా బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఇందులో ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది నిద్ర లేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నిద్రపోయే ముందు గ్రీన్ టీ, పాలు గానీ తాగడానికి బదులుగా హెర్బల్ టీ తీసుకుంటే ఇంకా ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బాదం.. బాదంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బిగుసుకుపోయిన కండరాలను వదులు చేస్తుంది. ఈ బాదం మెలటోనిన్ అనే హార్మోన్‌ను ప్రేరేపిస్తుంది. తద్వారా నిద్ర లేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బాదంపుప్పులో ఉండే ట్రిప్టోఫాన్ కూడా నిద్ర లేమి సమస్యను దూరం చేస్తుంది.
చిలగడదుంప.. అరటిపండు మాదిరిగా చిలగడదుంప కూడా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మూలకాలు కలిగి ఉంటుంది. ఈ పోషకాలన్నీ శారీరక విశ్రాంతిని కలిగిస్తాయి. ఇది నిద్రపోవడానికి ఉపకరిస్తుంది. చిలగడదుంపలో ఉండే కార్పోహైడ్రేట్స్.. నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.
అరటి పండు.. అరటిలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి కండరాలకు రిలాక్సేషన్ ఇస్తాయి. ఒత్తిడిగా ఫీల్ అయినా.. ఆందోళనలో ఉన్నప్పుడు అరటి పండు తినడం ద్వారా చాలా మంచి జరుగుతుంది. అరటిలో ఉండే విటమిన్ బి6 శరీరంలోని మెలటోనిన్ స్థాయిని పెంచుతుంది. ఇది మంచి నిద్రను ప్రేరేపిస్తుంది.