Diabetes: ఈ రక్త పరీక్షల ద్వారా మధుమేహాన్ని 20 ఏళ్ల ముందుగానే గుర్తించవచ్చు.. శాస్త్రవేత్తల వెల్లడి..!

Diabetes: మధుమేహం.. ఇది రోజురోజుకు చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో మధుమేహం ఉన్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఎక్కువగా వంశపారపర్యంగా ఈ వ్యాధి వ్యాపిస్తుండగా..

Diabetes: ఈ రక్త పరీక్షల ద్వారా మధుమేహాన్ని 20 ఏళ్ల ముందుగానే గుర్తించవచ్చు.. శాస్త్రవేత్తల వెల్లడి..!
Follow us

|

Updated on: Nov 13, 2021 | 6:52 PM

Diabetes: మధుమేహం.. ఇది రోజురోజుకు చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో మధుమేహం ఉన్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఎక్కువగా వంశపారపర్యంగా ఈ వ్యాధి వ్యాపిస్తుండగా, టెన్షన్‌, మానసిక ఆందోళన, వివిధ కారణాల వల్ల కూడా వ్యాపిస్తోంది. చిన్నా.. పెద్ద తేడా లేకుండా ఈ వ్యాధి అందరిని వెంటాడుతోంది. షుగర్‌ బారిన పడినట్లయితే మందులతో, జీవనశైలి మార్పులతో అదుపులో ఉంచుకోవాలి తప్ప.. పూర్తి స్థాయిలో నివారించేందుకు ఎలాంటి వైద్యం అందుబాటులో లేదు. తాజాగా స్వీడర్‌ శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. భవిష్యత్తులో మధుమేహం వస్తుంది అనే విషయాన్ని వివిధ పరీక్షల ద్వారా ముందుగానే గుర్తించవచ్చని స్పష్టం చేస్తున్నారు. రక్త పరీక్షల సహాయంతో మధుమేహాన్ని 20 ఏళ్ల ముందే అంచనా వేయవచ్చని చెబుతున్నారు. ఈ పరీక్ష ఫలితాలు మధుమేహాన్ని సకాలంలో నియంత్రించడంలో సహాయపడతాయని పేర్కొంటున్నారు. ఇలాంటి పరీక్షలు ద్వారా మధుమేహాన్ని ముందే గుర్తించడం ద్వారా భవిష్యత్తులో గుండె జబ్బులను సైతం తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు.

దీనిపై పరిశోధనలు చేసిన స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్తలు.. పరీక్షల ద్వారా టైప్‌ -2 డయాబెటిస్‌ వల్ల కలిగే ప్రమాదాలను తెలుసుకోవచ్చని చెబుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మానవుని రక్తంలో ఒక ప్రత్యేక ప్రోటీన్‌ను గుర్తించారు. దీనిని ఫోలిస్టాటిన్‌ అంటారు. ఈ ప్రోటీన్‌ పెరిగినట్లయితే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. అయితే పరిశోధనలలో పాల్గొన్న వ్యక్తులలో ఈ ప్రోటీన్‌ రక్త పరీక్షల ద్వారా గుర్తించారు.

ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. యూకేలో 5 మిలియన్ల మంది, యూఎస్‌లో 35 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఒక్క భారతదేశంలో 7.7 కోట్ల మంది మధుమేహం బారిన పడ్డారు. జన్యుపరంగా ఈ వ్యాధిగ్రస్తులు క్రమ క్రమంగా పెరిగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో కొన్ని పరీక్షల ద్వారా మధుమేహం వచ్చే విషయాన్ని ముందుగానే గుర్తించవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు.

స్వీడన్‌ శాస్త్రవేత్తలు 4,195 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. తర్వాత 20 సంవత్సరాలు ఆ వ్యక్తులకు క్రమ క్రమంగా పరీక్షలు నిర్వహించారు. కొంతకాలం తర్వాత వీరిలో 577 మంది టైప్‌-2 డయాబెటిస్‌ బారిన పడినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని నేచర్‌ కమ్యూనికేషన్‌లో ప్రచురించబడింది. దీని ప్రకారం.. వారి రక్తంలో అధి స్థాయిలో ఫోలిస్టాటిన్‌ ప్రోటీన్‌ ఉన్న రోగులలో 47 శాతం మంది కొన్ని సంవత్సరాల తర్వాత టైప్‌-2 డయాబెటిస్‌ బారిన పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలాంటి పరీక్షలు భవిష్యత్తులు మధుమేహం కేసులను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకుడు డాక్టర్‌ యాంగ్‌ డి మారినిస్‌ అభిప్రాయపడుతున్నారు.

మధుమేహం రెండు రకాలు.. టైప్‌-1, టైప్‌ -2. టైప్‌ 1 మధుమేహం కేసులు వారసత్వంగా, చిన్న వయసులోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు.. పుట్టబోయే బడ్డకు టైప్‌-1 డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో జీవన శైలి, వారస్తవంగా, వివిధ కారణాల వల్ల టైప్‌-2మధుమేహం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉబకాయం పెరగడం వల్ల కూడా మధుమేహం వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గించే 5 విషయాలు:

► రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.

► వారానికి 5 రోజులు వ్యాయం తప్పనిసరిగా చేయాలి.

► మీ బరువు పెరగకుండా చూసుకోవాలి.

► ఆహారంలో కూరగాయల పరిమాణాన్ని పెంచాలి.

►శీతల పానీయాలు, ప్యాక్‌ చేసిన పండ్ల రసాలు, సోడా పానీయాలకు దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి:

Diabetes Diet Chart: చాపకింద నీరులా డయాబెటిక్‌.. మధుమేహ రోగులు ఏమి తినాలి, తినకూడదు.. ఈ వివరాలు మీ కోసం..

Pneumonia: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? న్యుమోనియా ఉన్నట్లే..!

Health Tips: మీరు ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా..? జాగ్రత్త.. మీ మూడ్‌ను పాడు చేస్తాయి..!

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?