Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Fungus: కరోనా తర్వాత డెంగ్యూ రోగికి బ్లాక్‌ ఫంగస్.. కంటిచూపు కోల్పోయాడు..

Black Fungus: డెంగ్యూ ఇప్పుడు ప్రజలకు ప్రాణాంతకంగా మారుతోంది. దీని వల్ల రోగుల అవయవాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు తాజాగా బ్లాక్ ఫంగస్ (ముకారోమైకోసిస్) కూడా

Black Fungus: కరోనా తర్వాత డెంగ్యూ రోగికి బ్లాక్‌ ఫంగస్.. కంటిచూపు కోల్పోయాడు..
Dengue
Follow us
uppula Raju

|

Updated on: Nov 13, 2021 | 7:27 PM

Black Fungus: డెంగ్యూ ఇప్పుడు ప్రజలకు ప్రాణాంతకంగా మారుతోంది. దీని వల్ల రోగుల అవయవాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు తాజాగా బ్లాక్ ఫంగస్ (ముకారోమైకోసిస్) కూడా సంభవిస్తోంది. దీని కారణంగా ఇప్పుడు గ్రేటర్ నోయిడా నివాసి తాలిబ్ కంటి చూపు కోల్పోయాడు. ఇది అరుదైన కేసు అని వైద్యులు చెబుతున్నారు. ఇందులో డెంగ్యూ బ్లాక్ ఫంగస్‌కు కారణమైంది. రెండు వారాల క్రితం తాలిబ్‌కి డెంగ్యూ వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఆయనకు కంటిలో ఇబ్బంది ఏర్పడింది.

ఇది ఏదో సాధారణ సమస్య అని అనుకున్నారు. కానీ శనివారం ఉదయం అకస్మాత్తుగా అతను కంటి చూపు కోల్పోయాడు. చికిత్స నిమిత్తం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే ఒక కన్ను పూర్తిగా కోల్పోయాడని ఆసుపత్రి ఈఎన్‌టీ విభాగానికి చెందిన వైద్యుడు తెలిపారు. చూపు కోల్పోవడానికి గల కారణాన్ని పరిశోధించగా రోగి కంటిలో బ్లాక్‌ ఫంగస్ వచ్చిందని తేలింది. ఇదొక ఆశ్చర్యకరమైన కేసు. బ్లాక్ ఫంగస్ ఎక్కువగా అధిక మోతాదులో స్టెరాయిడ్లు ఇచ్చిన రోగులలో సంభవిస్తుంది. కానీ ఈ రోగికి అలాంటి సమస్య లేదు. కానీ చికిత్స సమయంలో ప్లేట్‌లెట్స్ బాగా తగ్గిపోయాయి. 15 రోజుల క్రితం డెంగ్యూ నుంచి కోలుకున్నాడు. కానీ శరీరంలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోయింది.

ప్రస్తుతం రోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని డాక్టర్ తెలిపారు. క‌రోనా త‌ర్వాత బ్లాక్ ఫంగ‌స్ కేసులు చాలా న‌మోద‌య్యాయ‌ని అయితే గ‌త రెండు నెల‌లుగా ఇలాంటి కేసులు లేవ‌ని ఇప్పుడు డెంగ్యూ త‌ర్వాత ఫంగ‌స్ వ‌స్తుండ‌డం ఆందోళ‌న‌కు గురిచేస్తోంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే బ్లాక్ ఫంగస్ ఒక ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్. ఈ ఫంగస్ ముక్కు, సైనస్‌లు, కళ్లు మెదడులోని కణజాలాలను వేగంగా దెబ్బతీస్తాయి. చికిత్సలో కొంచెం ఆలస్యం తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Kimjongun: కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించింది..! నెల రోజులుగా కనిపించడం లేదు..

CA Exams 2021: డిసెంబర్‌ 5 నుంచి CA పరీక్షల నిర్వహణ.. ICAI మార్గదర్శకాలు తప్పక తెలుసుకోండి..

Health Tips: మీరు వందేళ్లు జీవించాలంటే ఈ 5 ఆహారాలు ప్రతిరోజు తినాలి.. అవేంటంటే..?