Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kimjongun: కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించింది..! నెల రోజులుగా కనిపించడం లేదు..

Kimjongun: ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జాంగ్ ఉన్ నెల రోజులకు పైగా బహిరంగంగా కనిపించడం లేదు. కిమ్‌ ఆరోగ్యం దెబ్బతిందని పుకార్లు వినిపిస్తున్నాయి.

Kimjongun: కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించింది..! నెల రోజులుగా కనిపించడం లేదు..
Kim Jong Un
Follow us
uppula Raju

|

Updated on: Nov 13, 2021 | 4:26 PM

Kimjongun: ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జాంగ్ ఉన్ నెల రోజులకు పైగా బహిరంగంగా కనిపించడం లేదు. కిమ్‌ ఆరోగ్యం దెబ్బతిందని పుకార్లు వినిపిస్తున్నాయి. 2014 తర్వాత ఎక్కువ కాలం కిమ్ అదృశ్యం కావడం ఇదే. ఆ సమయంలో కిమ్ బహిరంగంగా కనిపించలేదు. దేశ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నారు. ఆ దేశ ప్రభుత్వ మీడియా ప్రకారం.. కిమ్ జోంగ్ చివరిసారిగా అక్టోబర్ 12న కనిపించారు. దీనికి ఒక రోజు ముందు అతను రాజధాని ప్యాంగ్యాంగ్‌లో జరిగిన క్షిపణి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

అయితే అప్పటి నుంచి కిమ్ గురించిన ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. ఇప్పటి వరకు ఉత్తర కొరియాలో జరిగిన ఏ పబ్లిక్ ఈవెంట్‌లోనూ కిమ్ కనిపించలేదు. నియంతలు అనారోగ్యం పాలైనప్పుడు ఇళ్లలో కాలక్షేపం చేస్తారని మీడియా కథనాలలో వెల్లడైంది. అక్టోబరు చివరలో కిమ్స్ ఇంటికి సమీపంలోని వోన్సన్ బీచ్ సరస్సులో ఒక పడవలో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. బహిరంగంగా హాజరు కానప్పటికీ కిమ్ పనిని కొనసాగిస్తున్నారని ఈ సమయంలో ఇతర దేశాధినేతలకు లేఖలు కూడా రాశారని రాష్ట్ర మీడియా నివేదించింది. ఉత్తర కొరియా సైన్యం సైనిక కార్యకలాపాల్లో చాలా బిజీగా ఉన్న సమయంలో కిమ్ అదృశ్యమయ్యారు. సైన్యం చాలా పరీక్షలు చేసింది. అందులో ఒకటి మొదటి హైపర్‌సోనిక్ క్షిపణి. ఐక్యరాజ్యసమితి తీర్మానాలను ఉల్లంఘిస్తూ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను కూడా పరీక్షించింది.

ఈ ఏడాది కిమ్ ఎనిమిది సార్లు అదృశ్యమయ్యారు కిమ్ జోంగ్ తీవ్ర అనారోగ్యంతో ఉండకపోతే వచ్చే నెలలో కిమ్ బహిరంగంగా కనిపించే అవకాశం ఉందని కొంతమంది చెబుతున్నారు. ఎందుకంటే తన తండ్రి కిమ్ జోంగ్-ఇల్ వర్ధంతి అయిన డిసెంబర్ 17న సమాధి సందర్శనకు వెళుతారని భావిస్తున్నారు. ఉత్తర కొరియా రహస్య దేశం కాబట్టి కిమ్ బహిరంగంగా కనిపించకపోవడంతో దేశంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియడం లేదు. ఈ ఏడాది కిమ్ ఎనిమిది సార్లు అదృశ్యమయ్యారు. కిమ్ తరచుగా ప్రజల మధ్య నుంచి అదృశ్యం కావడానికి ఆరోగ్యం క్షీణించడమే అని కొంతమంది విశ్వసిస్తున్నారు.

Lunar Eclipse 2021: నవంబర్ 19న చివరి చంద్రగ్రహణం.. ఈ 2 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..

Komaki నుంచి వెనిస్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్‌ అదిరిపోతున్నాయ్‌.. ఇక Olaకి గట్టి పోటీ..

Pan Card:18 ఏళ్ల లోపువారికి పాన్‌కార్డ్‌ అవసరమా..! అధికారులు జారీ చేస్తారా.. తెలుసుకోండి..