Komaki నుంచి వెనిస్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ అదిరిపోతున్నాయ్.. ఇక Olaకి గట్టి పోటీ..
Komaki Venice High Speed Scooter: ఢిల్లీకి చెందిన ఈవీ మేకర్ కోమాకి.. వెనిస్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. Komaki
Komaki Venice High Speed Scooter: ఢిల్లీకి చెందిన ఈవీ మేకర్ కోమాకి.. వెనిస్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. Komaki నుంచి హై-స్పీడ్ మోడల్స్ శ్రేణిలో ఈ స్కూటర్ ఐదవది. కొత్త వెనిస్ 10 రంగులలో రాబోతుంది. కోమాకి వెనిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రీజెనరేటివ్ బ్రేకింగ్, రిపేర్ స్విచ్, మొబైల్ కనెక్టివిటీ వంటి అనేక స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వస్తుంది. ఈ హై-స్పీడ్ EV పెద్ద సీటింగ్ ప్రాంతం, అదనపు స్టోరేజ్ బాక్స్‌ను కలిగి ఉంటుందని పేర్కొంది.
ఈ కొత్త మోడల్ రాబోయే లాంచ్ గురించి కొమాకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ.. “వెనిస్ మా అత్యంత ఉత్తేజకరమైన లాంచ్‌లలో ఒకటిగా ఉండబోతోంది. అధునాతన సాంకేతికతతో 10 అద్భుతమైన రంగులతో వస్తుంది. వినియోగదారులకు సంపూర్ణమైన ట్రీట్‌గా ఉండబోతోంది. ఇది రిపేర్ స్విచ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అన్ని సరికొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది భారతీయ రోడ్లపై నడపడానికి గొప్ప స్కూటర్‌గా మారుతుంది” అన్నారు.
ధర రూ.1 లక్ష లోపు ఉంటుంది వెనిస్ EV లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది చివరి నాటికి ఇది దేశంలో విక్రయానికి సిద్దంగా ఉంటుంది. Komaki బ్యాటరీ లేదా మోటారుకు సంబంధించి ఎలాంటి సాంకేతిక వివరాలు షేర్ చేయనందున స్కూటర్ అంచనా ధరపై వ్యాఖ్యానించడం కొంచె కష్టమే. అయితే ధర రూ.లక్ష లోపే ఉంటుందని అంచనా. Komaki ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇటీవలే జనవరి 2022లో భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్‌ను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది.
Komaki ప్రస్తుతం నాలుగు ఎలక్ట్రిక్ బైక్‌లను అందిస్తోంది. కొమాకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ “ప్రతి కస్టమర్ సెగ్మెంట్ అవసరాలను తీర్చడం మా లక్ష్యం. ఇప్పుడు మేము యుటిలిటీ సెగ్మెంట్‌లో బలమైన స్థావరాన్ని ఏర్పరచుకున్నాం. మా కొత్త క్రూయిజర్ లాంచ్ EVలు కేవలం రోజువారీ వినియోగానికి మాత్రమే కాదు అంతకు మించని” చెప్పారు.