Kids PAN Card: మీ పిల్లల పేరుపై పాన్‌ కార్డు కావాలా..? 18 ఏళ్ల లోపు ఉన్న వారు కూడా పాన్‌ పొందవచ్చు.. ఎలాగంటే..

Kids PAN Card: పాన్‌ కార్డు.. దీని గురించి అందిరికి తెలిసిందే. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలలో పాన్‌ కార్డు తప్పనిసరి..

Kids PAN Card: మీ పిల్లల పేరుపై పాన్‌ కార్డు కావాలా..? 18 ఏళ్ల లోపు ఉన్న వారు కూడా పాన్‌ పొందవచ్చు..  ఎలాగంటే..
Follow us

|

Updated on: Nov 13, 2021 | 3:24 PM

Kids PAN Card: పాన్‌ కార్డు.. దీని గురించి అందిరికి తెలిసిందే. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలలో పాన్‌ కార్డు తప్పనిసరి. ప్రస్తుతం అన్ని డాక్యుమెంట్లలో ప్రధానమైనది పాన్‌కార్డు. ఇది బ్యాంకింగ్‌కు సంబంధించిన పనులలో, ఇతర వాటిలో తప్పనిసరిగా అవసరం అవుతుంది. గతంలో పాన్‌కార్డు గురించి పెద్దగా పట్టించుకోకపోయినా.. ప్రస్తుతం చాలా అవసరం అవుతోంది. గతంలో పాన్‌ కార్డు కావాలంటే కనీసం 45 రోజుల సమయం పట్టేది. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో వారం రోజుల్లోనే ఇంటికి చేరుతుంది. ఈ పాన్‌ కార్డు పెద్దలకు మాత్రమే ఉండగా, 18 సంవత్సరాల్లోపు ఉన్న వారు కూడా పొందవచ్చు.

బ్యాంకు ఖాతా తెరవాలంటే, ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలంటే పాన్‌ తప్పనిసరి. దేశంలో పాన్‌ కార్డును ఒక గుర్తింపు పత్రంగా ఆమోదించబడింది. పాన్‌ కార్డు తీసుకోవాలంటే సాధారణంగా 18 సంవత్సరాలు నిండిన వారికి జారీ చేస్తారు. మీ పిల్లలకు పాన్‌ కార్డు కావాలంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కార్డును పొందాలంటే పలు విషయాలు గుర్తించుకోవాలి. పిల్లల పేరుపై పాన్‌ కావాలంటే తల్లిదండ్రులు వారి తరపున దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మీరు ఆన్‌లైన్‌లో పాన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా ఎన్‌ఎస్‌డీఎల్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. సంబంధిత అభ్యర్థి క్యాటగిరి ఎంచుకునే సమయంలో వ్యక్తిగత సమాచారం పూర్తిగా తెలుపాల్సి ఉంటుంది. కార్డు దారుడు మైనర్‌ అయి ఉంటే వయసు ధృవీకరణ పత్రంతో పాటు తల్లిదండ్రుల ఫోటోతో, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల సహాయంతో పిల్లల పేరుపై పాన్‌కార్డు తీసుకోవచ్చు. అందుకు రూ.107 ఛార్జిని చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు నమోదు చేసి, డాక్యుమెంట్లపై అప్‌లోడ్‌ చేసి, అందుకు రుసుమును చెల్లించి సబ్మిట్‌ చేయాలి. ఇలా చేసిన తర్వాత మీకు రషీదు నంబర్‌ వస్తుంది. ఈ నంబర్‌ ద్వారా మీ దరఖాస్తు స్టేటస్‌ తనిఖీ చేసుకోవచ్చు. మీరు దరఖాస్తును సమర్పించిన తర్వాత మీకు ఇమెయిల్‌ వస్తుంది. వెరిఫికేషన్‌ సక్సెస్‌ అయిన తర్వాత మీకు 15 రోజుల్లో పాన్‌కార్డు అందుకుంటారు.

కావాల్సిన పత్రాలు: పాన్‌కార్డ్‌ కోసం దరఖాస్తు చేయడానికి కొన్ని పత్రాలు అవసరం ఉంటుంటుంది. మైనర్ తల్లిదండ్రుల చిరునామా , దరఖాస్తుదారుని చిరునామా పత్రం అవసరం. అలాగే మైనర్ సంరక్షకుడు గుర్తింపు రుజువుగా ఈ డాక్యుమెంట్స్ అయిన ఆధార్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐ‌డిని సమర్పించాల్సి ఉంటుంది. ఇక అడ్రస్‌ వెరిఫికేషన్‌ కోసం మీ ఆధార్‌ కాపీ, పోస్టాఫీసు పాస్‌బుక్‌, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, ఒరిజినల్‌ రెసిడెన్సి సర్టిఫికేట్‌ అవసరమై ఉంటాయి. ఈ విధానం ద్వారా పిల్లల పేరుపై పాన్‌ కార్డు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి:

Fixed Deposit: సీనియర్‌ సిటిజన్లకు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులు ఇవే..!

Aadhar Verification: ఆధార్‌ సంస్థ కీలక నిర్ణయం.. వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆఫ్‌లైన్‌లోనూ ఆధార్‌ పరిశీలన..!