- Telugu News Photo Gallery Viral photos Can pan card be made even before the age of 18 know the whole process here
Pan Card:18 ఏళ్ల లోపువారికి పాన్‌కార్డ్ అవసరమా..! అధికారులు జారీ చేస్తారా.. తెలుసుకోండి..
Pan Card: ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, పాన్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలు ఒక మనిషికి చాలా అవసరం. శాశ్వత ఖాతా సంఖ్య (PAN) అనేది ఏదైనా ఆర్థిక
Updated on: Nov 12, 2021 | 10:26 PM


మీరు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే ప్రక్రియ చాలా సులభం. వాస్తవానికి ఏ మైనర్ నేరుగా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయలేరు కానీ వారి తరపున పిల్లల తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే మైనర్ వయస్సు రుజువు, తల్లిదండ్రుల ఫోటోలతో సహా అనేక ఇతర ముఖ్యమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. రూ.107 రుసుము చెల్లించిన తర్వాత మీరు ఫారమ్‌ను సమర్పించవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.15 రోజులలోపు పాన్ కార్డ్ మీకు చేరుతుంది.

పాన్ కార్డ్ దరఖాస్తు కోసం మైనర్ తల్లిదండ్రుల చిరునామా, గుర్తింపు రుజువు, అలాగే దరఖాస్తుదారు చిరునామా, గుర్తింపు రుజువు అవసరం. దీనితో పాటు మైనర్ సంరక్షకుడి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడిలలో ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించాలి.

చిరునామా రుజువు కోసం ఆధార్ కార్డు, పోస్టాఫీసు పాస్‌బుక్, ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రం లేదా నివాస ధృవీకరణ పత్రం కాపీని సమర్పించాలి.





























