- Telugu News Photo Gallery Viral photos Viral photos some interesting facts about world most expensive fish atlantic bluefin tuna fish
Viral Photos: ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప.. తినాలంటే అదృష్టం ఉండాలి..
Viral Photos: మీరు చేపల ప్రేమికులైతే మీరు తిన్న అత్యంత ఖరీదైన చేప ధర ఎంతుంటుంది. ఖచ్చితంగా మీ సమాధానం రూ.1000-1500 వరకు ఉంటుంది.
Updated on: Nov 13, 2021 | 9:38 PM

మీరు చేపల ప్రేమికులైతే మీరు తిన్న అత్యంత ఖరీదైన చేప ధర ఎంతుంటుంది. ఖచ్చితంగా మీ సమాధానం రూ.1000-1500 వరకు ఉంటుంది. కానీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేప ఏదో మీకు తెలుసా.. ఆ విశేషాలు తెలుసుకుందాం.

అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా ఫిష్ ధర మార్కెట్లో లక్షల రూపాయల వరకు ఉంటుంది కానీ అంతరించిపోయే దశకు చేరుకున్న ఈ చేపను పట్టుకోవడంపై నిషేధం ఉంది.

అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా ఫిష్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేపల ప్రేమికుల మొదటి ఎంపిక. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్ యజమానులు దీన్ని తమ మెనూలో చేర్చాలనుకుంటున్నారు కానీ దాని ధర చాలా ఎక్కువ ఇది చాలా మంది బడ్జెట్‌కు మించినది.

2019 సంవత్సరంలో 218 కిలోల అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా వేలం వేశారు. ఆ సమయంలో దాని ధర £ 2.5 మిలియన్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 25,86,05,135.25 కోట్లు.

అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా మూడు మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. దీని బరువు 250 కిలోల వరకు ఉంటుంది. ఈ చేప పరిమాణం ట్యూనా జాతులలో అతిపెద్దది ఇది చాలా వేగంగా ఈదుతుంది. ఈ చేపలు అంతరించిపోతున్న జాతులలో చేర్చారు. UKలో పట్టుకోవడం నేరం.





























