Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీరు వందేళ్లు జీవించాలంటే ఈ 5 ఆహారాలు ప్రతిరోజు తినాలి.. అవేంటంటే..?

Health Tips: ఎక్కువ కాలం జీవించాలంటే అది మీ ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. చాలా పరిశోధనలలో కూడా ఇదే తేలింది. కానీ ఇప్పుడున్న ఆధునిక ఆహార

Health Tips: మీరు వందేళ్లు జీవించాలంటే ఈ 5 ఆహారాలు ప్రతిరోజు తినాలి.. అవేంటంటే..?
Five Foods
uppula Raju
|

Updated on: Nov 13, 2021 | 5:53 PM

Share

Health Tips: ఎక్కువ కాలం జీవించాలంటే అది మీ ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. చాలా పరిశోధనలలో కూడా ఇదే తేలింది. కానీ ఇప్పుడున్న ఆధునిక ఆహార శైలి చిన్నాభిన్నంగా మారింది. సమయ పాలన లేని తిండి, అంతేకాక ఆయిల్ ఫుడ్స్‌, కొవ్వు పదార్థాలు తినడం వల్ల రోజు రోజుకి ఆయువు క్షీణిస్తుంది. అయితే కొంతమంది ఆహార నిపుణులు100 ఏళ్లు బతకాలంటే కచ్చితంగా ఈ ఐదు ఆహారాలను తినాలని చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

1. తేనె పచ్చి తేనెలో ఉండే సహజ పదార్థాలు గుండె జబ్బులతో పాటు కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. తేనె కణితి లేదా క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అంతేకాక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉదర సమస్యలని తగ్గిస్తుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలకు సహజ నివారణిగా పనిచేస్తుంది.

2. మేక కేఫీర్‌ ప్రతి సంవత్సరం క్యాన్సర్ వల్ల చాలామంది చనిపోతున్నారు. పులియబెట్టిన మేక కేఫీర్‌లో కనిపించే ప్రోబయోటిక్స్ రోగనిరోధక వ్యవస్థని ప్రేరేపిస్తాయి. క్యాన్సర్ కణితుల పెరుగుదలను తగ్గిస్తుంది. ఇది అనేక టెస్ట్ ట్యూబ్ పరిశోధనలలో నిరూపించారు. జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో కెఫీర్ సారం మానవ రొమ్ము క్యాన్సర్ కణాల సంఖ్యను 56 శాతం తగ్గించిందని కనుగొన్నారు.

3. దానిమ్మ దానిమ్మ విటమిన్ ఎ, సి, ఈ ఖనిజాలకు మూలం. ఇవి దీర్ఘాయువును పెంచుతాయి. అలాగే ఈ పండులో యాంటీ-వైరల్, యాంటీ-ట్యూమర్ గుణాలు ఉంటాయి. ఇది దీర్ఘకాలం జీవించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే దానిమ్మపండ్లను ఎక్కువగా తినాలి. దానిమ్మ రసం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.

4. పులియబెట్టిన ఆహారాలు పులియబెట్టిన ఆహారాలు మీ జీవక్రియ రేటుని పెంచుతాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలతో పాటు ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, దీర్ఘాయువుని అందిస్తాయి. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

5. ఆకుపచ్చ అరటి ఆకుపచ్చ అరటి శరీరానికి చాలా మంచిది. ఇది కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాకి ఆహారాన్ని అందిస్తుంది. గ్రీన్ అరటిపండులో ఒక రకమైన ప్రీబయోటిక్ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. వివిధ అధ్యయనాల ప్రకారం పచ్చి అరటిపండు తినడం వల్ల కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 50 శాతం వరకు తక్కువగా ఉంటుంది.

Lunar Eclipse 2021: నవంబర్ 19న చివరి చంద్రగ్రహణం.. ఈ 2 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..

Komaki నుంచి వెనిస్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్‌ అదిరిపోతున్నాయ్‌.. ఇక Olaకి గట్టి పోటీ..

Kimjongun: కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించింది..! నెల రోజులుగా కనిపించడం లేదు..

డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో
వంటకు అల్యూమినియం పాత్రల కంటే ఇత్తడి పాత్రలు మంచివి.. ఎందుకంటే
వంటకు అల్యూమినియం పాత్రల కంటే ఇత్తడి పాత్రలు మంచివి.. ఎందుకంటే
పసుపు, ఆకుపచ్చ, తెలుపు... ఏ గుమ్మడికాయ ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
పసుపు, ఆకుపచ్చ, తెలుపు... ఏ గుమ్మడికాయ ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. కొన్ని గంటల్లోనే రేట్లు తారుమారు..
మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. కొన్ని గంటల్లోనే రేట్లు తారుమారు..
రెండో పెళ్లికి రెడీగా సమంత..ప్లాన్ మాములుగా లేదుగా వీడియో
రెండో పెళ్లికి రెడీగా సమంత..ప్లాన్ మాములుగా లేదుగా వీడియో
1000కి పైగా సినిమాలు.. ప్రతి పాత్రకు ప్రాణం పోసింది..
1000కి పైగా సినిమాలు.. ప్రతి పాత్రకు ప్రాణం పోసింది..