గుడ్డులోని పసుపు భాగం ఎంతమంది తింటున్నారు..! మీకు ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Egg Yolk: ప్రతిరోజు గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండని చాలామంది వైద్యులు చెబుతారు. కానీ ఇప్పటికీ కొంతమందికి గుడ్డు గురించిన అపోహలు చాలా ఉన్నాయి. ఉడకబెట్టిన

గుడ్డులోని పసుపు భాగం ఎంతమంది తింటున్నారు..! మీకు ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Egg Yolk
Follow us
uppula Raju

|

Updated on: Nov 13, 2021 | 5:55 PM

Egg Yolk: ప్రతిరోజు గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండని చాలామంది వైద్యులు చెబుతారు. కానీ ఇప్పటికీ కొంతమందికి గుడ్డు గురించిన అపోహలు చాలా ఉన్నాయి. ఉడకబెట్టిన గుడ్డులోని పసుపు భాగం తినకూడదని అంటారు. అంతేకాదు ఏకంగా అది తింటే గుండెపోటు వస్తుందని భయపెడుతారు. కొవ్వు పెరుగుతుందని అది ఆరోగ్యానికి మంచిది కాదని వాదిస్తారు. కానీ అది నిజంకాదు. గుడ్డులోని పచ్చసోనలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా అవసరం కూడా.

గుడ్డులోని పసుపు, తెలుపు భాగం రెండూ కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి. కానీ పసుపు భాగం తింటే గుండెకి సంబంధించిన వ్యాధులు వస్తాయని అంటారు కానీ ఇది శాస్త్రీయంగా నిరూపించబడలేదు. అయితే ఏది కూడా ఎక్కువ తినడం మంచిది కాదు. అంటే రోజుకి ఏడు నుంచి పది గుడ్లు తినేవారు పసుపు భాగానికి దూరంగా ఉంటే మంచిదని వైద్యుల అభిప్రాయం. గుడ్డు పచ్చసొన అనేది కోలిన్‌కి అత్యంత సాంద్రీకృత మూలం. ఇది మెదడు ప్రధాన న్యూరోట్రాన్స్మిటర్లలో ఒకటైన ఎసిటైల్కోలిన్ ప్రధాన భాగం.

గర్భధారణ సమయంలో, చనుబాలిచ్చే సమయంలో, తగినంత కోలిన్ భర్తీ అవసరం. మెదడు సాధారణ పెరుగుదలకు కోలిన్ కచ్చతింగా అవసరం. అందుకే పసుపు భాగాన్ని తినాలి. గుడ్డులోని పసుపు భాగంలో విటమిన్ ఎ, డి, ఈ, కె, ఒమేగా-3 కొవ్వులు ఉంటాయి. ఫోలేట్, విటమిన్ B12 గుడ్డులోని తెల్ల భాగంతో పోలిస్తే పసుపు భాగంలో ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు మొహంపై వచ్చే వయసు సంబంధిత మచ్చలను కూడా దూరం చేస్తాయి. అయితే అధిక కొలెస్ట్రాల్, బీపీ ఉన్నవారు మాత్రం డాక్టర్‌ని సంప్రదించి గుడ్లు తింటే మేలు. లేదంటే అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలున్నాయి.

Kimjongun: కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించింది..! నెల రోజులుగా కనిపించడం లేదు..

Komaki నుంచి వెనిస్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్‌ అదిరిపోతున్నాయ్‌.. ఇక Olaకి గట్టి పోటీ..

Health Tips: మీరు వందేళ్లు జీవించాలంటే ఈ 5 ఆహారాలు ప్రతిరోజు తినాలి.. అవేంటంటే..?