AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roselle Fruit: షుగర్ కంట్రోల్ కోసం గోంగూర కాయలతో ఇలా చేసి చూడండి.. మంచి ఫలితం మీ సొంతం..

Roselle Fruit: ప్రకృతి ఇచ్చిన దివ్య వరం ఆకుకూరలు. అలాంటి ఆకుకూరల్లో ఒకటి గోంగూర. పుల్ల పుల్లగా ఉండే ఈ గోంగూర పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది..

Roselle Fruit: షుగర్ కంట్రోల్ కోసం గోంగూర కాయలతో ఇలా చేసి చూడండి.. మంచి ఫలితం మీ సొంతం..
Roselle Fruit Water
Surya Kala
|

Updated on: Nov 13, 2021 | 8:51 PM

Share

Roselle Fruit: ప్రకృతి ఇచ్చిన దివ్య వరం ఆకుకూరలు. అలాంటి ఆకుకూరల్లో ఒకటి గోంగూర. పుల్ల పుల్లగా ఉండే ఈ గోంగూర పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా గోంగూర పచ్చడిని ఆంధ్రమాత అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఈ  దేశవాళీ గోంగూర కాండము, ఆకుల తొడిమలు, ఈనెలు, పూవు లోని రక్షణ పత్రములు మొదలైన భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ గొంగూర అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాదు.. బోలెడన్ని పోషకాలున్నాయి. అయితే గోంగూరతో కంటే ఎక్కువ ప్రయోజనాలను గోంగూర కాయలు, పువ్వుల్లో ఉన్నాయట. వీటిని ఔషధ విలువ కోసం సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు.

ముఖ్యంగా గోంగూర కాయలు అధిక రక్తపోటు, గాయాలు, పూతల , జలుబుల నివారణకు సహాయపడుతుందని నమ్ముతారు. కొన్ని ప్రాంతాల్లో కండ్లకలక చికిత్సకు ఉపయోగిస్తారు.

*గోంగూర కాయలను ఆహారంలో భాగంగా చేసుకుంటే.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. *షుగర్ పేషేంట్స్ కు గోంగూర పువ్వులు ఓ దివ్య వరం.  షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడానికి గ్లాస్ వాటర్‌లో మూడు లేదా నాలుగు గోంగూర పువ్వులు వేసుకుని బాగా మరిగించి.. పరగడుపున తీసుకోవాలి. *అంతేకాదు గోంగూర పువ్వు తో చేసిన నీటిని రోజు పరగడుపున తాగితే అధిక బరువు సమస్య దూరం అవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బల పడి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి. *గోంగూర పూలను దంచి, అరకప్పు రసం చేసి.. దానిని వడకట్టి.. అరకప్పు రసంలో అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా తాగాల్సి ఉంది. *తరచూ గోంగూర పువ్వులను దంచి అర కప్పు రసం తీసి దానికి అరకప్పు పాలు కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది . *గోంగూర పువ్వులు వేసి మరిగించిన నీటిని సేవించటం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు నయం అవుతాయి. కిడ్నీలు శుభ్ర పడతాయి. మెదడు పని తీరు మెరుగు పడుతుంది. *జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది. కంటి చూపు పెరుగుతుంది. చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, కాంతి వంతంగా మెరిసి పోతుంది.

Also Read:  దుర్గ పూజ కోసం బంగారు మాస్క్ చేయించుకున్న ఓ వ్యాపారి.. ధర తెలిస్తే షాక్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్