Silent Killers In Women: మహిళలను వేధిస్తున్న సైలెంట్ కిల్లర్స్… నిర్లక్ష్యంతోనే ప్రమాదమెక్కువ..

కొన్ని రకాల వ్యాధులను మహిళల పట్ట సైలెంట్ కిల్లర్స్ పేర్కొనవచ్చని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు, హైపర్‌టెన్షన్, మధుమేహం సైలెంట్ కిల్లర్స్‌లో ప్రధానమైనవి. అలాగేప్రైమరీ అమిలోయిడోసిస్, మూత్రపిండ సమస్యలు, సెల్ కార్సినోమా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, హెపటైటిస్ బి లేదా సి ఇన్‌ఫెక్షన్ వంటివి కూడా ప్రమాదకరమని చెబుతున్నారు.

Silent Killers In Women: మహిళలను వేధిస్తున్న సైలెంట్ కిల్లర్స్… నిర్లక్ష్యంతోనే ప్రమాదమెక్కువ..
Follow us
Srinu

|

Updated on: Mar 07, 2023 | 3:45 PM

ఇంట్లోని పనంతా చేసే మహిళలను కొన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా ఏం అవ్వుద్దిలే.. అనే నిర్లక్ష్య ధోరణితో సమస్యలు మరింత పెరుగుతున్నాయి. ఇంటి పని, పిల్లలను సాకడం, ఇతర పనులు వల్ల ఆరోగ్యం మహిళలు తరచూ అలక్ష్యం ప్రదర్శిస్తూ ఉంటారు. మహిళలకు గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు, మధుమేహం, కాలేయ సమస్యలు వంటి అనేక వ్యాధులు నిశబ్ధంగా వాటి పనిపై అవి ఉంటాయి. ఈ వ్యాధులు వల్ల ఎలాంటి లక్షణాలు లేకపోయినా క్రమేపీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా మారి వేధిస్తాయి. ఒక్కోసారి ఆ వ్యాధుల ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల వ్యాధులను మహిళల పట్ట సైలెంట్ కిల్లర్స్ పేర్కొనవచ్చని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు, హైపర్‌టెన్షన్, మధుమేహం సైలెంట్ కిల్లర్స్‌లో ప్రధానమైనవి. అలాగేప్రైమరీ అమిలోయిడోసిస్, మూత్రపిండ సమస్యలు, సెల్ కార్సినోమా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, హెపటైటిస్ బి లేదా సి ఇన్‌ఫెక్షన్ వంటివి కూడా ప్రమాదకరమని చెబుతున్నారు. సైలెంట్ కిల్లర్‌లో నంబర్ వన్ గుండె వ్యాధులను వైద్యుల అభిప్రాయం. ఎందుకంటే రక్తపోటు, ధూమపానం, నిశ్చల జీవనశైలి, అధిక కొలెస్ట్రాల్ వంటి ప్రమాదాలను మరింత జఠిలం చేస్తాయి. వైద్యులు తెలిపే సైలెంట్ కిల్లర్ వ్యాధులు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

అండాశయాల క్యాన్సర్

ప్రతి 75 మంది మహిళల్లో ఒకరికి అండాశయాల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. చాలా మంది మహిళలు తమకు తెలియకుండానే ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు. ఐదేళ్లలో ఈ క్యాన్యర్ మనుగడ రేటు 46% మాత్రమే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించకపోతే అది చాలా ప్రమాదం. ఈ క్యాన్సర్ ఎంత ప్రమాదకరమంటే దీన్ని సంకేతాలను వైద్యులు కూడా గుర్తించలేరు. 

కార్డియోవాస్కులర్ వ్యాధి

ఎక్కువగా పని చేసే స్త్రీలు శ్వాస ఆడకపోవడం, వికారం అలసట వంటి లక్షణాలను కలిగి ఉంటారు. మీరు మీ కుటుంబంలో హృదయ సంబంధ వ్యాధుల చరిత్రను కలిగి ఉంటే, మీరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని గమనించాలి. ఎందుకంటే ఈ లక్షణాలను కార్గియోవాస్కులర్ వ్యాధి ప్రారంభ సంకేతాలుగా పేర్కొన్న వచ్చు. ఈ లక్షణలు కనిపిస్తే ప్రత్యేక శ్రద్ధ పెట్టి నివారణకు కృషి చేయాలి.

ఇవి కూడా చదవండి

లూపస్

లూపస్ అనేది దీర్ఘకాలిక, స్వయం ప్రతిరక్షక వ్యాధి. ఇది శరీరంలోని ఏదైనా ప్రదేశానికి (చర్మం, కీళ్ళు మరియు/లేదా శరీరంలోని అవయవాలు) హాని కలిగించవచ్చు. ముక్కు లేదా బుగ్గలపై దద్దుర్లు ఏర్పడవచ్చు, కీళ్ళు అసౌకర్యంగా ఉంటాయి. ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కష్టంగా మారవచ్చు. లక్షణాలు జుట్టు రాలడం, కడుపులో అసౌకర్యం మైగ్రేన్ వంటి లక్షణాలు ఉంటాయి.

మధుమేహం

మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం మధుమేహం అందరికీ వస్తుంది. అయితే స్త్రీలకు పురుషులతో పోలిస్తే ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం, చాలా సూక్ష్మంగా అకారణంగా హానికరం కాదు. మధుమేహాన్ని సరైన సమయంలో గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చు. 

పార్కిన్సన్స్ వ్యాధి

మోటారు న్యూరాన్ డిసీజ్ అనేది నాడీ సంబంధిత వ్యాధి. దీనిలో నరాల కణాలు కోలుకోలేని విధంగా నాశనమయ్యే స్థాయికి క్షీణిస్తాయి. రోగులు మొత్తం కండరాల సామర్థ్యాన్ని కోల్పోతారు. అంతేకాకుండా వ్యాధి ముదిరేకొద్దీ మరణించే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. 

మరిన్ని ఆరోగ్యసంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..