Women Health: మహిళలూ తస్మాత్ జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు.. ప్రాణాలే పోతాయ్..!

గుండె పోటు.. మన పెద్దలకకు దీని గురించి పెద్దగా టెన్షన్ లేదు. కానీ, నేటి జనరేషన్ వారికి వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అప్పటి వరకు నవ్వుతూ, కలివిడిగా ఉండే మనుషులు..

Women Health: మహిళలూ తస్మాత్ జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు.. ప్రాణాలే పోతాయ్..!
Women Health
Follow us

|

Updated on: Mar 03, 2023 | 6:21 PM

గుండె పోటు.. మన పెద్దలకకు దీని గురించి పెద్దగా టెన్షన్ లేదు. కానీ, నేటి జనరేషన్ వారికి వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అప్పటి వరకు నవ్వుతూ, కలివిడిగా ఉండే మనుషులు.. ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. గుండెపోటుతో ఆకస్మిక మరణాలకు గురవుతున్నారు. ఇప్పుడిదే ప్రతి ఒక్కరిని హడలెత్తిస్తుంది. స్త్రీ, పురుషులందరిలోనూ ఈ గుండెపోటు సాధారణమైపోయింది. అయితే, మహిళల్లో గుండెపోటు రావటానికి, పురుషుల్లో గుండెపోటు రావడానికి తేడాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అయితే, ఛాతిలో నొప్పి, అసౌకర్యంగా ఉంటుంది.

కానీ, స్త్రీలలో ఛాతి నొప్పి, ఛాతి పైభాగం బిగుతుగా మారడం, ఒక్కోసారి ఛాతి నొప్పి లేకుండానే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. పురుషులతో పోలిస్తే.. గుండెపోటుకు గురైన స్త్రీలు ఎక్కువ కాలం ఆస్పత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పురుషులతో పోలిస్తే.. మహిళలే ఎక్కువగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. అందుకే.. గుండెపోటును ముందే పసిగట్టాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. మరి మహిళల్లో కనిపించే గుండెపోటు లక్షణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. మెడ, దవడ, భుజం, ఎగువ వెనుక భాగం, నాభీ పైన పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

2. శ్వాస ఆడకపోవడం.

3. చేతులు లాగడం, తీవ్రమైన నొప్పి.

4. వికారం, వాంతులు.

5. తరచుగా చెమటలు పట్టడం.

6. తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది.

7. అసాధారణమైన అలసట ఉంటుంది.

8. గుండెల్లో మంట, అజీర్తి వేధిస్తుంది.

మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి.. గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ లక్షణాలను  నిర్లక్ష్యం చేయొద్దని, ఏమాత్రం నిర్లిప్తంగా వ్యవహరించినా ప్రాణాలే పోయే ఛాన్స్ ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles