Protein Powder Side Effects: ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తున్నారా.. ఎన్ని సైడ్ ఎఫెక్ట్సో తెలుసా!
శరీర ఆరోగ్యానికి విటమిన్స్, మినరల్స్, పోషకాలు, ఖనిజాలు వీటిల్లో ఏది తక్కువగా తీసుకున్నా.. బాడీపై ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా ప్రోటీన్ అనేది చాలా మంది అవసరం. ప్రోటీన్ సరిగ్గా అందక పోతే వివిధ జబ్బుల బారిన పడాల్సి వస్తుంది. ఇలా ప్రోటీన్ అందడం లేదనుకునే వారు ప్రోటీన్ పౌడర్ ను తీసుకోవడం కామన్ విషయం. జిమ్ లు, ఎక్సర్ సైజ్ లు చేసేవారు ఈ ప్రోటీన్ పౌడర్ ను ఎక్కువగా తీసుకుంటారు. కానీ దీని వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్..

శరీర ఆరోగ్యానికి విటమిన్స్, మినరల్స్, పోషకాలు, ఖనిజాలు వీటిల్లో ఏది తక్కువగా తీసుకున్నా.. బాడీపై ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా ప్రోటీన్ అనేది చాలా మంది అవసరం. ప్రోటీన్ సరిగ్గా అందక పోతే వివిధ జబ్బుల బారిన పడాల్సి వస్తుంది. ఇలా ప్రోటీన్ అందడం లేదనుకునే వారు ప్రోటీన్ పౌడర్ ను తీసుకోవడం కామన్ విషయం. జిమ్ లు, ఎక్సర్ సైజ్ లు చేసేవారు ఈ ప్రోటీన్ పౌడర్ ను ఎక్కువగా తీసుకుంటారు. కానీ దీని వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
కిడ్నీ డ్యామేజ్ అవుతుంది:
ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రోటీన్ మోతాదు ఎక్కువ అయితే యూరిన్ కాల్షియం విసర్జన, అతి మూత్ర సమస్యలు, మూత్ర పిండాల పని తీరుకు అంతరాయం కలగడం, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గట్ హెల్త్ ని దెబ్బ తీస్తాయి:
ప్రోటీన్ పౌడర్లలో చాలా రకాలు ఉంటాయి. వీటిల్లో టేస్ట్ కోసం స్వీటెనర్స్, కలర్స్ వంటివి యాడ్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఈ పదార్థాలు హెల్దీ గల్ బ్యాక్టీరియాను దెబ్బ తీస్తాయి. అంతే కాకుండా జీర్ణ సమస్యలు కూడా తలెత్తవచ్చు. కొంత మందికి ఈ ప్రోటీన్ పౌడర్ పడక పోవడంతో వెయిట్ లాస్ కూడా అవుతారు.
చక్కెర స్థాయిలు పెరుగుతాయి:
ప్రోటీన్ పౌడర్ ను తయారు చేయాలంటే ఎక్కువగా షుగర్ ని ఉపయోగిస్తారు. దీని వల్ల ఇన్సులిన్ స్పీడ్ గా పెరుగుతుంది. దీని వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా డయాబెటీస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్:
కొన్ని రకాల ప్రోటీన్స్ పౌడర్స్.. సోయా బేస్డ్ ఉంటాయి. వీటిని తెలీకుండా తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలతు తలెత్తవచ్చు. సోయాలో అమైనో ఆమ్లాలు, ఫైటో ఈస్ట్రోజన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా అలసటగా ఉండటం, కోరికలు తగ్గడం, రొమ్ము పరిమాణంలో మార్పులు రావడం జరుగుతాయి. కాబట్టి ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకునే ముందు పలు జాగ్రత్తలు వహించాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








