Watermelon: మీరు తినే పుచ్చకాయ మంచిదేనా..! కల్తీ పుచ్చకాయలను గుర్తించడం ఎలా.? పూర్తి వివరాలు
వేసవి కాలంలో పుచ్చకాయ అందరికీ ఇష్టమైన పండు. దీనిలోని తీపి రుచి మరియు పోషకాలు ఆకర్షణీయం. అయితే, మార్కెట్లో కల్తీ పుచ్చకాయలు విరివిగా లభిస్తున్నాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. కల్తీ పుచ్చకాయలను గుర్తించడం ఎలా అనేది తెలుసుకుందాం. ఆ వివరాలు ఇలా

సమ్మర్ లో ముఖ్యంగా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే పుచ్చకాయ లోపల ఉండే ఎర్రటి గుజ్జు, తీయటి రుచితో ఉండి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటర్ మెలన్ గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షణ కలిగిస్తుంది. అందుకే కల్తీ లేని పుచ్చకాయను తినాలి. మార్కెట్లో పుచ్చకాయ కొనేటప్పుడు అది స్వచ్ఛమైనదో కాదో గుర్తించటం తప్పనిసరి. ఎందుకంటే మార్కెట్లోకి కల్తీ పండ్లు వచ్చాయి. చూడటానికి ఎర్రగా ఉన్నాయని పండ్లను తినకండి. ముందు అవి స్వచ్ఛమైనవో కాదో గుర్తించాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కల్తీ పుచ్చకాయను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మొదట పుచ్చకాయ కొన్నప్పుడు విక్రేతను ఒక చిన్న ముక్కను కట్ చేసి మీకు ఇవ్వమని అడగండి.
ఇది చదవండి: ఈ ఫోటోలో మీకు మొదటిగా కనిపించేది.. మీరెలాంటివారో చెప్పేస్తుంది.. ఎలాగంటే.?
తర్వాత కట్ చేసిన పుచ్చకాయ ముక్క లోపలి భాగాన్ని టిష్యూ పేపర్ లేదా కాటన్ బాల్ తో సున్నితంగా రుద్దండి. టిష్యూ పేపర్ రుద్దినప్పుడు రంగు మారితే అది కల్తీ పుచ్చకాయ అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెబుతోంది. అది స్వచ్ఛమైన పుచ్చకాయ అయితే దాని రంగు మారదు. ఈ సింపుల్ టిప్ ద్వారా కల్తీ పుచ్చకాయను ఈజీగా గుర్తించవచ్చని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు తెలిపారు. పుచ్చకాయలో అక్కడక్కడా కొద్దిగా తెలుపు, పసుపు ఉంటే అది కల్తీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. పుచ్చకాయలను త్వరగా పండించడానికి కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. అందువల్ల పుచ్చకాయ పైభాగంలో పసుపు రంగు కనిపిస్తే తినడానికి ముందు ఉప్పునీటిలో బాగా కడగడం మంచిది. పుచ్చకాయ కొనేటప్పుడు మీరు దానిని జాగ్రత్తగా పరిశీలించాలి. రసాయనాలతో చేసిన పండ్లను తినడం వల్ల కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. మితిమీరిన కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
క్రోమేట్ కడుపు సమస్యలు, రక్తహీనత, మెదడు దెబ్బతినటం, సంతానోత్పత్తి తగ్గటం వంటి సమస్యలను కలిగిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను తింటాం. కానీ మనం తినే పండ్లు శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే లాభం కోసం పండ్లపై రసాయనాలు వాడుతున్నారు. రసాయన రహిత పండ్లు తినటం మాత్రమే ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా పుచ్చకాయలో రంధ్రాలు ఉంటే కొనకపోవడమే మంచిది. రుచిని జోడించడానికి సిరింజీలు వేసి ఉండవచ్చు. అది కల్తీ పుచ్చకాయ అయితే మీరు దానిని కోసినప్పుడు పండ్లలో ఎక్కువ పగుళ్లు ఉంటాయి. అందువల్ల పుచ్చకాయ కొనేటప్పుడు కొన్న తర్వాత ఈ దశలను పాటిస్తే అది మంచిదా చెడ్డదా అని మీరు సులభంగా గుర్తించవచ్చని నిపుణులు అంటున్నారు.
ఇది చదవండి: దమ్మునోడురా మావా.! బీసీసీఐ ఛీ కొట్టి తరిమేసింది.. కట్ చేస్తే.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








