ప్రభాస్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న బ్యూటీ.. 25 ఏళ్లులో తొలిసారి తెలుగులోకి
రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చూస్తే మెంటలెక్కుతుంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలో చేస్తూ దూసుకుపోతున్నాడు . ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది .

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేశాడు. గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు మన పాన్ ఇండియా స్టార్. ఇటీవలే సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నాడు ప్రభాస్. ఇక ఇప్పుడు వరుస ఆసినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు రెబల్ స్టార్. ప్రభాస్ నటించిన కల్కి సినిమా రీసెంట్ గా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏకంగా 1000కోట్లకు పైగా వసూల్ చేసింది. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో సందీప్ రెడ్డి వంగ సినిమా ఒకటి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు.
ఇది కూడా చదవండి :ఏంటీ.. ఈ జబర్దస్త్ కమెడియన్ ప్రభాస్ ఫ్రెండా..!! ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే
స్పిరిట్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు సందీప్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫిసర్ గా కనిపిస్తాడని ఇప్పటికే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే ఈ సినిమా మొదలవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమాకంటే ముందే ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు సలార్ 2, కల్కి 2 సినిమాలు పూర్తి కావాల్సి ఉంది. ఆతర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇది కూడా చదవండి : హీరోయిన్స్‌కు మించిన అందం..! ఛత్రపతి శేఖర్ భార్యను చూశారా..? ఏ మూవీస్‌లో నటించారంటే
ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాలో ఓ అందాల భామ నటించనుందని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ ఇటీవల యష్ నటిస్తున్న టాక్సిక్ అనే సినిమాలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా నుంచి ఆమె తప్పుకుందని తెలుస్తోంది. ఆమె ప్లేస్ లో నయనతారను తీసుకోనున్నారని టాక్. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమాలో కరీనా కపూర్ నటిస్తుందని తెలుస్తోంది. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 25 ఏళ్లు అవుతుంది. ఈ పాతికేళ్లలో ఆమె తెలుగులో నటించలేదు. ఇక మొదటిసారి ప్రభాస్ సినిమాతో కరీనా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది చూడాలి.
ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో కాళ్లు కడిగి పెళ్లి చేశా.. కానీ రెండేళ్లు నన్ను దూరం పెట్టాడు: రాజారవీంద్ర
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




