Black Raisin: నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల ఎన్ని లాభాలో.. డయాబెటిక్ నుంచి బీపీ వరకు సర్వరోగ నివారిణి
డ్రై ఫ్రూట్స్‌లలో ఎండు ద్రాక్ష ఒకటి. ఎండుద్రాక్షను చాలా మంది ఇష్టంగా తింటారు. ఎండుద్రాక్షను చాలా వంటల్లో కూడా ఉపయోగిస్తారు. ఎండుద్రాక్షలో నల్ల ఎండుద్రాక్ష గురించి ఎప్పుడైనా విన్నారా? నల్ల ఎండుద్రాక్ష రుచికి చాలా తియ్యగా ఉంటుంది. ఎండుద్రాక్ష రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. రాత్రంతా నీళ్లలో ఎండుద్రాక్ష నానబెట్టి, ఉదయాన్నే వాటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. రక్త శుద్ధి నుంచి అధిక రక్తపోటును తగ్గించడం వరకు, నల్ల ఎండుద్రాక్ష చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నల్ల ఎండుద్రాక్షలో సహజ యాంటీఆక్సిడెంట్లు..

డ్రై ఫ్రూట్స్‌లలో ఎండు ద్రాక్ష ఒకటి. ఎండుద్రాక్షను చాలా మంది ఇష్టంగా తింటారు. ఎండుద్రాక్షను చాలా వంటల్లో కూడా ఉపయోగిస్తారు. ఎండుద్రాక్షలో నల్ల ఎండుద్రాక్ష గురించి ఎప్పుడైనా విన్నారా? నల్ల ఎండుద్రాక్ష రుచికి చాలా తియ్యగా ఉంటుంది. ఎండుద్రాక్ష రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. రాత్రంతా నీళ్లలో ఎండుద్రాక్ష నానబెట్టి, ఉదయాన్నే వాటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. రక్త శుద్ధి నుంచి అధిక రక్తపోటును తగ్గించడం వరకు, నల్ల ఎండుద్రాక్ష చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నల్ల ఎండుద్రాక్షలో సహజ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. శరీరాన్ని బలోపేతం చేయడంలో సహాయపడే ఐరన్‌తో సహా అనేక మినరల్స్ వీటిల్లో ఉంటాయి. నల్ల ఎండుద్రాక్ష మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నల్ల ఎండుద్రాక్ష వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాం..
రక్తం శుద్ధి అవుతుంది
రక్తంలోని మలినాలు శుభ్రంకాకపోతే చర్మం నిర్జీవంగా మారుతుంది. ఫలితంగా మొటిమల సమస్య పెరుగుతుంది. ప్రతిరోజూ నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల రక్తంలోని టాక్సిన్స్, వ్యర్థాలు, మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. నల్ల ఎండుద్రాక్షలో సహజ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని పూర్తిగా నిర్విషీకరణకు సహాయపడతాయి.
రక్తపోటును నియంత్రిస్తుంది
అధిక రక్తపోటును తగ్గించడంలో బ్లాక్ రైసిన్ చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. నిజానికి పొటాషియం మన శరీరంలో సోడియం స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది అధిక రక్తపోటుకు ప్రధాన కారణం. అధిక రక్తపోటుతో బాధపడేవారు పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం.
ఎముకలను బలోపేతం చేస్తుంది
నల్ల ఎండుద్రాక్షలో పొటాషియంతోపాటు కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. కాల్షియం లోపం వల్ల బోలు ఎముకల వ్యాధి వంటి తీవ్రమైన ఎముక వ్యాధులకు దారితీస్తుంది. అటువంటి పరిస్థితిలో రోజూ నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల ఎముకలు చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా నల్ల ఎండుద్రాక్ష దంతాలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.
జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది
నల్ల ఎండుద్రాక్షను క్రమం తప్పకుండా తినడం వల్ల జుట్టు రాలడం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. నల్ల ఎండుద్రాక్షలో ఉండే పోషకాలు స్కాల్ప్‌కి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు సహాయపడతాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. వీటిల్లో ఉండే విటమిన్ సి జుట్టుకు పోషణనిస్తుంది. తద్వారా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
నలుపు ఎండుద్రాక్ష తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అంటే చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. నల్ల ఎండుద్రాక్షలో ఉండే పాలీఫెనాల్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. మహిళలల్లో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. నల్ల ఎండుద్రాక్ష రోజూ తినడం వల్ల వీటిల్లోని ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, రక్తహీనతను దూరం చేస్తుంది.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








