PM Modi: ప్రపంచస్థాయి ప్రమాణాలతో పంజాబ్ లో క్యాన్సర్ ఆసుపత్రి.. రేపు జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్రమోదీ

దేశంలో అత్యంత ప్రమాదకరరోగాల్లో క్యాన్సర్ ఒకటి.. ఈవ్యాధి కారణంగా చనిపోతున్నవారి సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతోంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల చికిత్స ఎంతో ఖరీదైనది కావడంతో.. పేద ప్రజలకు అందుబాటులోకి ఈవైద్యాన్ని తీసుకొచ్చేందుకు

PM Modi: ప్రపంచస్థాయి ప్రమాణాలతో పంజాబ్ లో క్యాన్సర్ ఆసుపత్రి.. రేపు జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్రమోదీ
Cancer Hospital Punjab
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 23, 2022 | 6:08 PM

PM Modi: దేశంలో అత్యంత ప్రమాదకరరోగాల్లో క్యాన్సర్ ఒకటి.. ఈవ్యాధి కారణంగా చనిపోతున్నవారి సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతోంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల చికిత్స ఎంతో ఖరీదైనది కావడంతో.. పేద ప్రజలకు అందుబాటులోకి ఈవైద్యాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి క్యాన్సర్ చికిత్సను తీసుకురావడంతో పాటు.. దేశ వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే అస్సాంలో ఏడు క్యాన్సర్ ఆసుపత్రులను ఈఏడాది ఏప్రియల్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈఏడాది జనవరిలో పశ్చిమబెంగాల్ లోని 460 పడకత సామర్థ్యంతో చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ రెండవ క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రేపు పంజాబ్ లో హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతిక అంకితం చేయనున్నారు.

పంజాబ్, చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన కేన్సర్ చికిత్సను అందించేందుకు అజీత్ సింగ్ నగర్ జిల్లా (మొహాలీ) లోని న్యూ చండీగఢ్ పరిధి లో గల ముల్లాన్ పుర్ లో 660 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈఆసుప్రతిని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగాని కి చెందిన సతంత్య్ర సంస్థ అయిన టాటా మెమోరియల్ సెంటర్ నిర్మించింది. 300 పడకల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈఆసుపత్రిలో క్యాన్సర్ కు సంబంధించిన అన్ని చికిత్సలను అందించనున్నారు. పంజాబ్ లోని చాలా ప్రాంతాల్లో క్యాన్సర్ ప్రాబల్యం ఎక్కువుగా ఉందని.. చికిత్స కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారన్న నివేదికల నేపథ్యంలో పంజాబ్ లో ఈక్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. పంజాబ్ లోని బటిండా నుంచి రాజస్థాన్ లోని బికనీర్ కు వెళ్లే ఒక రైలును క్యాన్సర్ రైలుగా పిలుస్తారు. దాదాపు ఈరైలులో క్యాన్సర్ రోగులు చికిత్స కోసం వెళ్తుంటారు. సంగ్రూర్ లోని 2018లో ప్రారంభించిన 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రికి అనుసంధానంగా ఈఆసుపత్రి సేవలు అందిచనుంది.

కేవలం పంజాబ్ ప్రజలకే కాకుండా.. ఇతర రాష్ట్రాల ప్రజలకు ఇక్కడ చికిత్స అందించనున్నారు. 2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగా ఆయుష్మాన్ భారత్ కింద ఒక్కో కుటుంబానికి వైద్య చికిత్స కోసం గరిష్ఠంగా రూ.5లక్షల రూపాయలు ప్రభుత్వమే భరిస్తుండగా.. ఈపథకంలో క్యాన్సర్ చికిత్సను చేర్చారు. ఈపథకం కింద ఎంపికచేయబడిన ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రధానమంత్రి స్వాస్థ సురక్ష యోజన-PMSSY కింద దేశంలో ఏర్పాటు చేయబడిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(AIIMS)లలో క్యాన్సర్ చికిత్స అందించడంపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టికేంద్రీకరించింది. క్యాన్సర్ చికిత్సకు వాడే మందుల ధరలను 2019లో కేంద్రప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ఇలా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఈవ్యాధి నియంత్రణ, క్యాన్సర్ తో చనిపోయే వారి సంఖ్యను నియంత్రించడానికి కేంద్రప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. పంజాబ్ లో రేపు ప్రారంభంకానున్న అతిపెద్ద హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రం క్యాన్సర్ రోగులకు చికిత్స అందిచడంలో కీలకం కానుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..