పాలకూర: పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చాలా తక్కువ మొత్తంలో కేలరీలను కలిగి ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్లు, ఎ, సి, కె వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు వేగంగా బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.