Diabetic Patients: పెరుగుతున్న ఇన్సులిన్ తీసుకునే షుగర్ పేషేంట్స్ సంఖ్య.. ధరను అదుపు చేయాలంటున్న బాధితులు

దేశంలో 2.5 లక్షల మంది టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. డయాబెటిక్ రోగులలో ఇన్సులిన్ ఆధారపడటం గణనీయంగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. వీరిలో టైప్ 1 , టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులు ఉన్నారు.

Diabetic Patients: పెరుగుతున్న ఇన్సులిన్ తీసుకునే షుగర్ పేషేంట్స్ సంఖ్య.. ధరను అదుపు చేయాలంటున్న బాధితులు
Insulin
Surya Kala

|

Aug 23, 2022 | 7:58 PM

Diabetic Patients: భారతీయుల్లో రోజు రోజుకీ షుగర్ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే చాలామంది షుగర్ వ్యాధి నియంత్రణ కోసం ఇన్సులిన్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ ఇన్సులిన్ ధర అధికంగా ఉండడంతో ఈ వ్యాధితో బాధపడుతున్నవారు చాలా కలవరపడుతున్నారు. దీనికి కారణం ఇన్సులిన్ ఉత్పత్తిలో, సప్లై చేయడంలో క్రమబద్ధీకరణ ఏజెన్సీ లేనందున, ఇన్సులిన్ ధర ఇతర విషయాలతోపాటు, స్థానికంగా వర్తించే పన్నుల ఆధారంగా ఒకొక్క రాష్ట్రానికి మారుతూ ఉంటుంది.

న్యూఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇన్సులిన్ ధర రూ.150-200, ముంబైలో ఇంజక్షన్ రూ.120-150, హైదరాబాద్‌లో రూ.147-170 లు ఉంది. అయితే కోల్‌కతాలో రూ.250. అన్ని రాష్ట్రాల కంటే అధికంగా ఉంది. ఇన్సులిన్ అధిక ధర ఎందుకు ఆందోళనకు కారణంగా మారింది అంటే.. మధుమేహం కేసులు ప్రపంచంతో పోలిస్తే భారతదేశంలో అత్యధికంగా ఉన్నాయి. రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అందువల్ల, దేశంలో ముగ్గురులో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారన్నా ఆశ్చర్యం లేదు. భారతదేశంలో ఈ వ్యాధి నిర్వహణ ఒక సవాలుగా ఉంది. ఆ పైన టైప్ 1,  2 మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.  వీరు ఇన్సులిన్‌పై ఆధారపడి ఉంటారు.

మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సాకేత్‌లోని పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ గణేష్ జెవ్లికర్ ప్రకారం..  డయాబెటిక్ పేషెంట్లలో (టైప్ 1 ,యు 2) స్థిరమైన పెరుగుదల కనిపిస్తోందని.. ఎక్కువమంది ఇన్సులిన్‌పై ఆధారపడి ఉన్నారని తెలుస్తోంది.

డాక్టర్ జెవ్లికర్ మాట్లాడుతూ ఇన్సులిన్ డిపెండెన్స్ రెండు సందర్భాలలో కనిపిస్తుంది: టైప్ 1 (చిన్న పిల్లలు), టైప్ 2, ఇది జీవనశైలి మార్పుల వంటి వివిధ కారణాల వల్ల పెద్దవారిలో కనిపిస్తుంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం దేశంలో 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో టైప్ 1 డయాబెటిస్ కేసులు దాదాపు లక్ష వరకు ఉన్నాయి. అలాగే, ఈ వయస్సులో ప్రతి సంవత్సరం దాదాపు 16,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో 2.5 లక్షల మంది టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతున్నారని అంచనా.

దురదృష్టవశాత్తూ, టైప్ 1 డయాబెటిస్ ఉన్న పిల్లవాడు తన జీవితాంతం ఇన్సులిన్‌పై ఆధారపడి ఉండాలసిందే నని నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్, డయాబెటిస్, ఎండోక్రినాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఆర్‌కె ప్రసాద్ వివరించారు. టైప్ 1 డయాబెటిస్ జన్యుపరమైనది లేదా ఇన్సులిటిస్ వల్ల వస్తుంది.. ప్యాంక్రియాస్‌లోని ఇన్సులిన్-ఉత్పత్తి చేసే బీటా కణాలు క్రమంగా చనిపోతాయి. కనుక అవి శరీరంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేవు. శరీరంలో ఇన్సులిన్ లేకపోవడం వలన.. శరీరానికి బయటనుంచి అందించాల్సి ఉంటుంది.

మధ్యతరగతి కుటుంబాలకు సైతం ఇన్సులిన్ ఖర్చు భారంగా మారింది. నోయిడాలో నివసిస్తున్న 50 ఏళ్ల గృహిణి స్వప్నిల్ మొహంతి మాట్లాడుతూ, “నా 19 ఏళ్ల కొడుకు గత మూడేళ్లుగా ఇన్సులిన్‌పై ఆధారపడి జీవిస్తున్నాడు. అప్పటి నుండి అతని పరిస్థితిలో ఎటువంటి మెరుగు కనిపించలేదు.. వ్యాధి తగ్గుముఖం పట్టలేదని చెప్పారు.  ప్రతి నెలా రూ. 20,000 అదనపు భారం పడుతుందన్నారు. ఇన్సులిన్ కోసం చేస్తున్న ఖర్చు మాకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ తల్లి. కనుక ఇన్సులిన్ ధర కొంత క్రమబద్ధీకరణ జరగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu