Paracetamol Side Effects: మీరు తరచుగా పారాసెటమాల్‌ను వాడుతున్నారా..? అయితే సమస్యల్లో చిక్కుకున్నట్లే.. జాగ్రత్త..!
Paracetamol Side Effects: చాలా మంది జ్వరం, ఒంటినొప్పులు, వాంతులు, ఇలా రకరకాల సమస్యలు తలెత్తగానే వెంటనే టాబ్లెట్స్ వాడే అలవాటు ఉంటుంది. ఇక సాధారణంగా..
Paracetamol Side Effects: చాలా మంది జ్వరం, ఒంటినొప్పులు, వాంతులు, ఇలా రకరకాల సమస్యలు తలెత్తగానే వెంటనే టాబ్లెట్స్ వాడే అలవాటు ఉంటుంది. ఇక సాధారణంగా జ్వరం, తలనొప్పి వంటివి రాగానే ముందుగా పారాసెలమాల్ వాడుతుంటారు. ఈ ఔషధాన్ని ఎప్పుడు ఏ పరిమాణంలో ఉపయోగించాలో చాలా మందికి తెలియదు. ఇష్టానుసారంగా వాడుతుంటే సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. శరీరంలో ఏదైనా పెద్ద రోగానికి సంకేతం లేని లక్షణాలు కనిపించినట్లయితే, లేదా ఏదైనా చిన్నపాటి నొప్పి ఉన్నట్లయితే వాటి నుంచి రక్షించుకునేందుకు వివిధ రకాల మందులను వాడుతుంటాము. కానీ వాటి వల్ల ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పారాసెటమాల్ తరచుగా తీసుకోవడం వల్ల నష్టాలు కలిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు వైద్యులు.
పారాసెటమాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు:
పారాసెటమాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అల్సర్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. తరచుగా జ్వరం వచ్చినప్పుడు పారాసెలమాల్ మందులను ఉపయోగిస్తారు. కానీ ఈ ఔషధాన్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కువగా తీసుకుంటే అప్పుడు ఎసిడిటీ సమస్య, కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఇవి తీవ్రమైతే రక్తం వాంతులు కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.
పారాసెలమాల్ ఎక్కువగా వాడితే అలెర్జీలతో పాటు మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీని వల్ల మీకు ఎలర్జీలు, చర్మంపై దద్దుర్లు, రక్త సంబంధిత సమస్యలు వస్తాయి. వైద్యులను సంప్రదించకుండా పారాసెలమాల్ వేసుకుంటే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉందంట. పారాసెమాల్‌ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల విరేచనాలు, విపరీతమైన చెమటలు పట్టడం, ఆకలి లేకపోవడం, విశ్రాంతి లేకపోవటం, కడుపు నొప్పి, ఉబ్బరం, నొప్పి, పొత్తికడుపు తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి