Health: నూనెల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఎక్కువైతే మాత్రం పెను ఆరోగ్య సమస్యలు తప్పవు

అన్ని రకాల వంటల్లో నూనె (Cooking Oil) తప్పనిసరి. పోపు వేయాలన్నా, వేపుళ్లు చేయాలన్నా, పొడులు చేయాలన్నా నూనె అత్యవసర పదార్థం. నూనె లేని వంటకాలను ఊహించుకోలేం. అయితే అధిక నూనె వినియోగం ఆరోగ్యానికి హానికరం...

Health: నూనెల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఎక్కువైతే మాత్రం పెను ఆరోగ్య సమస్యలు తప్పవు
Edible Oil
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 23, 2022 | 10:00 AM

అన్ని రకాల వంటల్లో నూనె (Cooking Oil) తప్పనిసరి. పోపు వేయాలన్నా, వేపుళ్లు చేయాలన్నా, పొడులు చేయాలన్నా నూనె అత్యవసర పదార్థం. నూనె లేని వంటకాలను ఊహించుకోలేం. అయితే అధిక నూనె వినియోగం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనకు తెలిసిందే. ఈ మేరకు వైద్యులు, నిపుణులు కూడా నూనె వాడకంపై సూచనలు ఇస్తూ ఉంటారు. అధిక నూనె వల్ల శరీరంలో అనవసరపు కొవ్వు పేరుకుంటుంది. అది రక్తనాళాల్లో రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. తద్వారా గుండె సంబంధిత (Heart Problems) సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వంటలో ఉపయోగించే నూనెతో సహా ప్రతిరోజూ 3-4 టీ స్పూన్లు శరీర అవసరాలకు సరిపోతుంది. నూనెల్లోని ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు శరీరానికి అవసరం కాబట్టి నూనె లేని ఆహారం తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఎయిమ్స్ వైద్యుల ప్రకారం నూనెలోని మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ రక్తంలోని కొవ్వులను తగ్గించడంలో ప్రభావంతంగా పని చేస్తుందని తేలింది. ఈ రకమైన కొవ్వు ఆలివ్ నూనె, కనోలా నూనెలో అధికంగా ఉంటుంది. అవోకాడోలు, పిస్తా, వాల్‌నట్‌, బాదం, నువ్వులు నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వు అధిక మొత్తంలో లభిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల పరిస్థితిని మెరుగుపరచడం, గుండె జబ్బులను నివారించడం, ఆయుర్దాయాన్ని పెంచేందుకు నూనెలోని ఈ కొవ్వు ఉపయోగపడుతుంది.

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చేపల్లో సమృద్ధిగా ఉంటాయి. అయితే చాలా మంది చేపలు తినేందుకు ఆసక్తి చూపించరు. కాబట్టి వారికి ఈ ఫ్యాటీ ఆమ్లాల్లోని పోషకాలు లభించవు. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. కాబట్టి నూనెలను తగినంత మొత్తంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాల్‌నట్‌లు, ఆవాలు, సోయాబీన్, నువ్వులు, వేరుశనగ, కనోలా నూనె, అవిసె గింజలు, చియా గింజలతో తయారైన నూనెల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా ఉపయోగించే కొబ్బరి నూనెలోనూ సంతృప్త కొవ్వులు, పాల్మిటిక్ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనె కూడా శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే.. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు నూనెను అధికంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే శరీరానికి అవసరమైనంత మేరకే తీసుకోవడం ఉత్తమం. మొతాదు మించితే పెను ఆరోగ్య సమస్యలు తప్పవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణులు సూచనలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే