AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Side Effect: గుడ్డు తింటున్నారా.. అది ఎలాంటి గుడ్డో తెలుసుకుంటే మంచిది.. కంట్రీ గుడ్డు కంటే పౌల్ట్రీ ఎగ్ సూపరట..

Egg Side Effect: గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనన్న విషయం అందరికి తెలిసిందే. గుడ్ల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజుకో గుడ్డు తింటే అద్భుతమైన ..

Egg Side Effect: గుడ్డు తింటున్నారా.. అది ఎలాంటి గుడ్డో తెలుసుకుంటే మంచిది.. కంట్రీ గుడ్డు కంటే పౌల్ట్రీ ఎగ్ సూపరట..
Egg Side Effect
Subhash Goud
|

Updated on: Aug 22, 2022 | 3:18 PM

Share

Egg Side Effect: గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనన్న విషయం అందరికి తెలిసిందే. గుడ్ల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజుకో గుడ్డు తింటే అద్భుతమైన ప్రయోజనాలున్నాయని ఇప్పటికే వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. అందుకే గుడ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక గుడ్లు పౌల్ట్రీఫారంలో, ఇళ్లల్లోనే పొదుగుతాయి. ఎక్కువగా మనం తినే గుడ్లు పౌల్ట్రీఫారంలో నుంచి వచ్చినవే ఉంటాయి. అక్కడ తయారైన గుడ్లు షాపులకు సరఫరా చేస్తుంటారు. కొందరు  కోళ్లను ఇంట్లో పెంచుతూ అవి పెట్టే గుడ్లను సేకరిస్తుంటారు. తోటల్లో పండించే కూరగాయను స్వచ్ఛమైనదిగా పరిగణించినట్లే, ఇంట్లో ఉండే జంతువుల నుండి పాలు, కోళ్గ నుంచి వచ్చే గుడ్లు కూడా ఉత్తమమైనవిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇవన్నీ మన పర్యవేక్షణలో జరుగుతాయి కాబట్టి. కొత్త పరిశోధన ప్రకారం.. ఇంట్లో కోడి గుడ్లు తినడం పౌల్ట్రీ ఫామ్‌ల కంటే ప్రమాదకరమని రుజువు అవుతోంది. అంటే ఇంట్లో పెంచుకునే కోళ్ల నుంచి వచ్చే గుడ్లు అన్నమాట. సైన్స్ డైరెక్ట్ నివేదిక ప్రకారం.. గుడ్ల తాజాదనం దాని స్వచ్ఛతకు సంకేతం కాదని ప్రమాదం కూడా ఉందట. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలో కోళ్లపై చేసిన పరిశోధనలో వెల్లడైంది. ఇంట్లో పెంచే కోళ్ల గుడ్ల వల్ల ఎంత ప్రమాదం.. వాటి గుడ్ల వల్ల ప్రమాదమేంటి? ఈ ప్రశ్నలకు 5 పాయింట్లలో సమాధానాలు తెలుసుకోండి.

  1. 25 వేల ఇళ్ల నుంచి నమూనాలు: పరిశోధనల కోసం ఆస్ట్రేలియాలోని 25 వేల ఇళ్లలోని తోటల నుంచి మట్టి నమూనాలు తీసుకున్నారు పరిశోధకులు. వీటిలో సిడ్నీలోని 55 ఇళ్ల మట్టి కూడా ఉంది. పౌల్ట్రీలో పెంచే కోళ్లలో కంటే దేశవాళీ కోళ్ల గుడ్లలో సీసం 40 శాతం ఎక్కువగా ఉంటుందని నివేదిక వెల్లడించింది. సిడ్నీలో ప్రతి రెండు కోళ్లలో ఒకదానిలో సీసం గుర్తించారు.
  2. సీసం మానవులకు ప్రమాదకరం: కోళ్లు, ఇళ్లలో పెంచే వాటి గుడ్లలో కూడా సీసం ఉన్నట్లు గుర్తించారు. ఇది మానవులకు ప్రమాదకరమంటున్నారు. ఎందుకంటే ఒక్క ఆస్ట్రేలియాలోనే 400,000 మంది ప్రజలు పౌల్ట్రీని పెంచుతున్నారు. వాటి గుడ్లు పెద్ద ఎత్తున విక్రయించబడుతున్నాయి. ఇంట్లో పెంచే కోళ్ల గుడ్లు కూడా అంత సేఫ్ కాదని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.
  3. మూత్రపిండాల నష్టం, గర్భస్రావం ప్రమాదం: ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం.. సీసం మానవులకు అనేక విధాలుగా ప్రమాదకరం. ఇది రక్తపోటును పెంచుతుంది. మూత్రపిండాలకు హాని కలిగించవచ్చు. గుండె జబ్బులకు దారితీయవచ్చు. IQ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఇది కాకుండా ఇది మహిళల్లో గర్భస్రావానికి కూడా కారణం కావచ్చంటున్నారు.
  4. సీసం కోళ్లకు ఎలా చేరింది: కోళ్లలో ప్రమాదకరమైన సీసం మట్టి ద్వారా చేరుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కోళ్లు సాధారణంగా మట్టిలో పడి ఉన్న వస్తువులను తిని మట్టిని గీసుకుంటాయి. ఈ విధంగా వారి శరీరంలో సీసం ప్రవేశిస్తుంది. శరీరానికి చేరిన తర్వాత, దాని పరిమాణం గుడ్లలో కూడా కనుగొనబడింది. పరిశోధనలో కోళ్ల ఆహారం, నీటిలో సీసం పరిమాణం కూడా ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు. ఆస్ట్రేలియాలో తీసుకున్న శాంపిల్స్ పరిశోధనలో ఈ విషయం నిర్ధారించబడింది.
  5. ఇవి కూడా చదవండి
  6. సీసం ఎంత ప్రమాదకరం: డెసిలీటర్‌కు 20 మైక్రోగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ హాని కలిగిస్తుంది. గతంలో ఇంట్లో ఉన్న కోళ్లలో సీసం 20 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి