Psoriasis: ఆందోళన కలిగిస్తున్న సొరియాసిస్.. పెను సవాల్ గా మారుతున్న చికిత్స.. ఆ దశ దాటితేనే..

భారతదేశంలో సోరియాసిస్ (Psoriasis) కేసులు పెరిగాయి. దేశ జనాభాలో 20 శాతం నుంచి 25 శాతం మంది భారతీయులను ఈ వ్యాధి ప్రభావితం చేస్తోంది. ఫలితంగా సామాజికంగా, ఆర్థికంగా అసమానతలు ఏర్పడుతున్నాయి. పూర్తి నివారణ లేనప్పటికీ...

Psoriasis: ఆందోళన కలిగిస్తున్న సొరియాసిస్.. పెను సవాల్ గా మారుతున్న చికిత్స.. ఆ దశ దాటితేనే..
Psoriasis
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 23, 2022 | 1:51 PM

భారతదేశంలో సోరియాసిస్ (Psoriasis) కేసులు పెరిగాయి. దేశ జనాభాలో 20 శాతం నుంచి 25 శాతం మంది భారతీయులను ఈ వ్యాధి ప్రభావితం చేస్తోంది. ఫలితంగా సామాజికంగా, ఆర్థికంగా అసమానతలు ఏర్పడుతున్నాయి. పూర్తి నివారణ లేనప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏటా ఆగస్టులో సోరియాసిస్ అవేర్‌నెస్ మంత్ గా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూడా వ్యాధి నివారణే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. స్త్రీల కంటే పురుషులు అధికంగా ఈ వ్యాధి ప్రభావానికి గురవుతున్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం ఇండియాలో (India) సోరియాసిస్ కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఐదు నుంచి 10 శాతం మాత్రమే ఉన్న సొరియాసిస్ కేసులు.. ప్రస్తుతం 20 శాతం నుంచి 25 శాతానికి చేరాయి. ఈ వ్యాధి కారణంగా బాధితులు, వారి కుటుంబాల జీవన నాణ్యత దెబ్బ తింటోందని డెర్మటాలజీ సీనియర్ డాక్టర్ విజయ గౌరీ బండారు చెప్పారు. ఫలితంగా శారీరక, మానసిక, సామాజిక భారం ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వంశపారంపర్య చర్మ వ్యాధి. రోగనిరోధక స్వభావాన్ని కలిగి ఉంటుంది. డెత్ సెల్స్ పొరల రూపంలో అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. పొలుసుల మాదిరిగా చర్మంపై తెల్లటి పొర ఏర్పడుతుంది. తర్వాత చర్మం రాలిపోతుంది.

హైపోథైరాయిడిజం, చల్లని వాతావరణం, మధుమేహం, ఊబకాయం, స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్లు, ధూమపానం, ఆల్కహాల్ వంటివి ఈ వ్యాధి కారకాలు పెరిగేందుకు దోహదపడతాయి. సొరియాసిస్ వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాబట్టి దీనిని పూర్తిగా నయం చేయలేమని, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధిని అదుపులోకి తీసుకురావచ్చని వైద్య నిపుణులు తెలిపారు. వైద్యుల సలహాలు తీసుకుంటూ క్రమం తప్పకుండా జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. సొరియాసిస్ చర్మం, అరచేతులు, అరికాళ్లు, గోర్లపై వస్తుంది. చర్మకణాల మధ్య దురద కారణంగా చర్మం పొరల రూపంలో ఏర్పడి, పొలుసులుగా రాలిపోతుంది. సోరియాటిక్ ఎరిత్రోడెర్మా అనేది అత్యంత తీవ్రమైన సోరియాసిస్‌లో ఒకటి. ఇది శరీరం అంతటా ఎర్రటి దద్దుర్లు, చర్మంపై పొట్టుకు కారణమవుతుంది. అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

సోరియాసిస్ బాధితులు చికిత్సకు ఆటంకం కలిగించే మానసిక-సామాజిక స్టిగ్మాను ఎదుర్కొంటారు. ఈ పరిస్థితి ఉన్నవారికి చికిత్స చేసే విషయంలో ఈ సమయం చాలా కీలకం. ఈ స్టేజ్ ను దాటగలిగితే విజయం సాధించినట్లేనని వైద్యులు వెల్లడించారు. సాధారణంగా సొరియాసిస్ బాధితులు మానసికంగా ఆందోళన చెందుతుంటారు. సమాజంలో చులకన అయిపోతామేమోననే భావనతో ఉంటారు. ఫలితంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. అందుకే వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే