Omega 3: ఒమేగా 3 శరీరానికి చాలా అవసరం.. ఇది ఏ ఆహారాలలో లభిస్తుందంటే..!
Omega 3: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒమేగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక తీవ్రమైన వ్యాధుల
Omega 3: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒమేగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదం నుంచి కాపాడుతుంది. ఇది మన శరీరానికి శక్తిని మంచి కేలరీలను అందిస్తుంది. ఒమేగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఒమేగా -3 ఏ ఆహారాలలో లభిస్తుందో తెలుసుకుందాం.
1. అవిసె గింజలు: అవిసె గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇందులో విటమిన్ ఈ, మెగ్నీషియం వంటి అనేక ఇతర పోషకాలు ఉంటాయి.
2. వాల్‌నట్‌లు: వాల్‌నట్‌లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లకు మంచి మూలమని చెప్పవచ్చు. మీరు డైట్‌లో కచ్చితంగా వాల్‌నట్‌లను చేర్చుకోవాలి. ఇందులో కాపర్, విటమిన్ ఈ, మెగ్నీషియం వంటి అనేక ఇతర పోషకాలు ఉంటాయి.
3. సోయాబీన్స్: సోయాబీన్స్‌లో ఒమేగా-3, ఒమేగా-6 రెండూ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, విటమిన్లు అధికంగా ఉంటాయి.
4. గుడ్లు: ఒమేగా-3 యాసిడ్స్ కోసం మీరు తప్పనిసరిగా ఆహారంలో గుడ్లను చేర్చుకోవాలి. గుడ్లలో ప్రొటీన్లు, విటమిన్లు, ఒమేగా 3 యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.
5. గ్రీన్ వెజిటేబుల్స్: గ్రీన్ వెజిటేబుల్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు అధింకగా ఉంటాయి. మీరు ఆహారంలో పాలకూర, ఆకుకూరలు చేర్చవచ్చు. ఈ కూరగాయలలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కాకుండా, కాలీఫ్లవర్‌లో ఒమేగా-3 యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి