- Telugu News Photo Gallery Viral photos The only train in the country that does not charge fares 73 years of free service
Indian railway: దేశంలో ఛార్జీలు వసూలు చేయని ఏకైక రైలు.. 73 సంవత్సరాలుగా ఉచిత సేవ..!
Indian railway: భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. ఆసియాలో రెండో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. దేశంలో సుమారు 8000 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. దాదాపు 12,167 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి.
Updated on: May 09, 2022 | 6:45 AM

భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. ఆసియాలో రెండో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. దేశంలో సుమారు 8000 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. దాదాపు 12,167 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఇది కాకుండా 7,349 గూడ్స్ రైళ్లు ఉన్నాయి. ఇక్కడ రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఎవరైనా టికెట్ లేకుండా పట్టుబడితే జరిమానా చెల్లించాలి. అయితే దేశంలో ఒక రైలు ఉంది. ఇందులో ప్రయాణించడానికి టికెట్ అవసరం లేదు.

ఈ రైలు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సరిహద్దులో నడుస్తుంది. గత 73 ఏళ్లుగా 25 గ్రామాల ప్రజలు ఈ రైలులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ రైలును భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు నిర్వహిస్తోంది. భాక్రా డ్యామ్ గురించి సమాచారం ఇవ్వడానికి ఈ రైలును నడుపుతారు.

ఈ రైలు ద్వారా బర్మాలా, ఒలిండా, నెహ్లా, భక్రా, హండోలా, స్వామిపూర్, ఖేదా బాగ్, కలాకుండ్, నంగల్, సలాంగ్డి, లిడ్కోట్, జగత్ఖానా, పరోయా, చుగతి, తల్వారా, గోల్తాయ్ వంటి సమీప గ్రామాల ప్రజలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ రైలు వల్ల విద్యార్థులు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. రోజుకు రెండుసార్లు ప్రయాణిస్తుంది.

ఈ రైలు ప్రత్యేకత ఏంటంటే కోచ్‌లు చెక్కతో తయారై ఉంటాయి. ఇందులో టిటి ఉండరు. ఈ రైలు డీజిల్‌తో నడుస్తుంది. ఇంతకుముందు ఈ రైలులో 10 కోచ్‌లు ఉండేవి. ఇప్పుడు మూడు కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఒక కోచ్‌ను పర్యాటకులకు, ఒక కోచ్‌ను మహిళలకు కేటాయించారు.



