Coronavirus: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే.. ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు.. వైద్యుల హెచ్చరిక..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ రోజువారీగా 2లక్షలకు పైగా నమోదు..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ రోజువారీగా 2లక్షలకు పైగా నమోదు అవుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసుల సంఖ్య రోజూ పెరుగుతూపోతోంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ కొత్త లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు జ్వరం, కీళ్ల నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం లాంటివి కోవిడ్ లక్షణాలు కాగా.. తాజాగా మరిన్ని బయటపడ్డాయి. ఇదిలా ఉంటే తలనొప్పి, తీవ్ర నీరసం వంటి సమస్యలతో బాధపడే వారిని పరీక్షిస్తే కరోనా పాజిటివ్ ఎక్కువగా వస్తోందని గుర్తించారు. కనుగుడ్డు నుంచి కూడా వైరస్ శరీరంలోనికి చేరుతోందని, వారిలో కళ్లు ఎర్రబడుతున్నట్టుగా చెబుతున్నారు. ఇవే కాకుండా కీళ్లనొప్పులు, మైయాల్జియా, జీర్ణసంబంధ సమస్యలు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కూడా కొత్తగా వెలుగు చూస్తున్నాయి.
అందువల్లే ఫస్ట్ వేవ్ కంటే మరింత వేగంగా కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తోందని… ప్రజలు కూడా నిర్లక్ష్యంగా తిరుగుతూ ఉండడం వల్ల వైరస్ తీవ్రత మరింత పెరిగిపోతోందని ఏపీ కోవిడ్-19 నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. జన్యు మార్పుల ప్రభావం వల్ల వైరస్ సంక్రమణ లక్షణాలు పెరగడంతో శాస్త్రవేత్తలు కొత్త జాబితాను రూపొందించారు. కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇలా ఉన్నాయి.
కళ్లు ఎర్రబడడం:
కళ్లు ఎర్రబడడం లేదా కండ్లకలక అనేది అనేక వైరల్ ఇన్ఫెక్షన్లకు సంకేతం. అయితే దీనిలో కళ్లు ఎర్రగా, వాపుగా ఉండడంతోపాటు కంటి నుంచి నీరు వస్తుంది. చైనాకు చెందిన ఓ అధ్యయనం ప్రకారం కొత్త స్ట్రెయిన్ వైరస్ బారినపడిన వారిలో ఈ లక్షణాలు కనిపించాయి. ఇప్పుడు మన దగ్గర కూడా కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో కళ్లు ఎర్రబడడం అనేది ఎక్కువగా కనిపిస్తోంది.
జీర్ణ సంబంధిత సమస్యలు:
కరోనా సంక్రమణ ఎక్కువగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. విరేచనాలు, వాంతులు, కడుపు తిమ్మిరి, వికారం, నొప్పి అనేది కరోనా వైరస్ సంకేతాలు. మీరు ఏదైనా జీర్ణ సంబంధిత సమస్యలు ఎడురుకున్నట్లయితే.. దాన్ని తేలికగా తీసుకోకండి. వెంటనే టెస్ట్ చేయించుకోండి.
బ్రెయిన్ పనితనం తగ్గడం:
జ్ఞాపకశక్తి లేదా మొదడుకు సంబంధించిన సమస్యలను కరోనా వైరస్ అధికం చేస్తుంది. గందరగోళంగా ఉండడం లేదా విషయాలను గుర్తించుకోవడంలో ఇబ్బంది ఎదురైతే.. అది ఖచ్చితంగా కరోనా సమస్యకు సంకేతం. ఈ లక్షణాలకు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. కానీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.
అసాధారణ దగ్గు:
కరోనా వైరస్ సాధారణ లక్షణాల్లో దగ్గు కూడా ఒకటి. ఆ ఇన్ఫెక్షన్ బారినపడిన వ్యక్తులకు ఒకవేళ దగ్గు వస్తే.. అది సాధారణ దగ్గుని పోలి ఉండదు. దానికి భిన్నంగా దగ్గు నిరంతరం వస్తూనే ఉంటుంది. అలాగే మీ మాటలో కూడా మార్పు ఉంటుంది.
వినికిడి బలహీనత:
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం కరోనా వినికిడి సమస్యలకు దారితీస్తుంది. 56 అధ్యయనాలు చేసిన అనంతరం కరోనా శ్రవణ, వెస్టిబ్యులర్ వ్యవస్థకి సంబంధించిన సమస్యలను సృష్టించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
సాధారణ లక్షణాలు:
కరోనా సాధారణ లక్షణాలు జ్వరం, శరీర నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం, చలి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి.. కొత్త లక్షణాలతో సహా ఈ లక్షణాలను మీలో గమనించినట్టయితే వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కరోనా పరీక్ష చేయించుకోవడం మంచిది. కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లిన ప్రతిసారి మాస్కు ధరించడం, ఇతరులతో భౌతిక దూరం పాటించడం, సబ్బుతో లేదా శానిటైజర్‌తో చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవడం, తిరిగి ఇంటికి రాగానే స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి.
Also Read:
కుటుంబాన్ని తుడిచిపెట్టేసిన కరోనా.. 15 రోజుల్లో ఐదుగురు బలి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు.!
ఆకలి మీదున్న సింహం వేట.. లైవ్‌లో వీక్షించిన పర్యాటకులు.. చివరికి ఏం జరిగిందంటే.!
వీధుల్లో ప్రవహించిన ‘పాల నది’.. ఆశ్చర్యపోయిన జనం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
రోజూ ఈ ఐదు వ్యాయామాలు చేస్తే.. వారం రోజుల్లో మీ బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టొచ్చట.!