AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: రోజూ ఈ ఐదు వ్యాయామాలు చేస్తే.. వారం రోజుల్లో మీ బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టొచ్చట.!

ఈ కాలంలో ప్రతీ ఒక్కరూ కూడా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అంతేకాదు అబ్బాయిలు అయితే మాత్రం అందంగా, సిక్స్ ప్యాక్ యాబ్స్‌తో...

Weight Loss Tips: రోజూ ఈ ఐదు వ్యాయామాలు చేస్తే.. వారం రోజుల్లో మీ బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టొచ్చట.!
Belly Fat
Ravi Kiran
|

Updated on: Apr 17, 2021 | 9:36 PM

Share

ఈ కాలంలో ప్రతీ ఒక్కరూ కూడా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అంతేకాదు అబ్బాయిలు అయితే మాత్రం అందంగా, సిక్స్ ప్యాక్ యాబ్స్‌తో చూడడానికి ఆకర్షణగా ఉండాలని అనుకుంటారు. ఇది ఇలా ఉంటే ఉద్యోగ ఒత్తిడి, ప్రయాణాలు, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తదితర విషయాలు ద్వారా అబ్బాయిల అందరికి పొట్ట రావడం సహజం అయిపోయింది. ఇలా బెల్లీ ఫ్యాట్ ఉండటం వల్ల అనుకోని రోగాలు కూడా వస్తాయి. అందువల్ల అబ్బాయిలు ఏదో ఒకటి చేసైనా పొట్ట తగ్గించుకోవాలని చాలా కష్టాలు పడుతున్నారు. కొంతమంది జిమ్‌లకు వెళ్లి మరీ శ్రమ పడుతుంటారు. బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే.. మనం రోజూ తినే ఆహారంలోనే కొన్ని మార్పులు చేసుకోవాలి. అలాగే రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయాలి. పొట్ట తగ్గించడంలో భాగంగా రోజూ చేసే వ్యాయామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Crunches:

పొట్ట తగ్గించడంలో భాగంగా Crunches ఉత్తమమైన వ్యాయామం. ఆరోగ్య నిపుణులు కూడా దీనిని సిఫార్సు చేస్తారు. ఈ వ్యాయామం కొవ్వు తగ్గడానికి ఉపయోగపడటమే కాకుండా యాబ్స్ రావడంలో కూడా సహాయపడుతుంది.

Walking:

ఈ వ్యాయామం చేయడం వల్ల కొవ్వు తగ్గడమే కాకుండా మీరు ఎలప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. బరువు తగ్గాలంటే, వాకింగ్ ఎక్సర్‌సైజ్ తప్పనిసరిగా చేయాలి. అలాగే రోజూ అరగంట వేగంగా పరిగెత్తడం వల్ల బెల్లీ ఫ్యాట్ క్రమేపీ తగ్గుతూ వస్తుంది. అటు ఈ వ్యాయామం వల్ల మీ జీవక్రియ, హార్ట్ రేటు కూడా మెరుగ్గా ఉంటుంది.

Zumba:

పొట్ట తగ్గించడంలో భాగంగా కొంతమందికి వ్యాయామాలు చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు. అలాంటి వారికి Zumba చాలా మేలు చేస్తుంది. ఇలా చేయడం ద్వారా, మీ బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాకుండా.. ఒత్తిడి కూడా దూరం అవుతుంది. అలాగే కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్‌ను సైతం తగ్గిస్తుంది. గుండెకు సైతం మేలు చేస్తుంది.

Cycling:

ఉదర కొవ్వును తగ్గించడానికి సైక్లింగ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది క్యాలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. సైక్లింగ్ చేయడం ద్వారా తొడల దగ్గర కొవ్వును, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించవచ్చు. ఇందుకోసం రెగ్యులర్‌గా సైక్లింగ్ చేయడం చాలా అవసరం.

Aerobic:

మీరు జిమ్‌కు వెళ్లకుండా బెల్లీ ఫ్యాట్ తగ్గించాలనుకుంటే, మీరు కొన్ని ఏరోబిక్ వర్కౌట్‌లను చేయవచ్చు. ఈ వ్యాయామం క్యాలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Also Read:

ఆ వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు ఎక్కువ.. తస్మాత్ జాగ్రత్త.! హెచ్చరిస్తున్న వైద్యులు..

మద్యం సేవిస్తే కరోనా వైరస్ తగ్గుతుందా.? అపోహలు.. నిజాలు.! వివరాలివే..

కూరగాయలు సర్దుతుండగా భార్యాభర్తలకు ఊహించని షాక్.. పాలకూర‌లో నక్కిన పాము.. భయానక వీడియో.!