AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Date palm: రంజాన్‌ నెలలో టానిక్‌లా ఖర్జూర పండ్లు.. శరీరంలోని వ్యర్ధాలను తొలగించి.. ఫుల్ ఎనర్జీ ఇస్తాయి

రంజాన్‌ నెలలో హలీంకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. ఖర్జూర పండ్లకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఖర్జూరంలో ఏడు అద్భుత ఆరోగ్య ఔషధాలుంటాయి.

Date palm:  రంజాన్‌ నెలలో టానిక్‌లా ఖర్జూర పండ్లు.. శరీరంలోని వ్యర్ధాలను తొలగించి.. ఫుల్ ఎనర్జీ ఇస్తాయి
Khajur
Ram Naramaneni
|

Updated on: Apr 18, 2021 | 7:29 AM

Share

రంజాన్‌ నెలలో హలీంకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. ఖర్జూర పండ్లకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఖర్జూరంలో ఏడు అద్భుత ఆరోగ్య ఔషధాలుంటాయి. తేలికగా జీర్ణం అవడమే కాదు.. శరీరానికి టానిక్‌లా పనిచేస్తాయి.  శరీరంలోని వ్యర్ధాలను తొలగించి.. అవసరమైన శక్తినిచ్చేవే ఈ ఖర్జూర పండ్లు. రంజాన్‌మాసం మొదలవడంతో.. సంప్రదాఫలం ఖర్జూరం నీరాజనాలందుకుంటోంది. ఈ పండుతోనే ముస్లింలు ఉపవాస దీక్ష చేపడతారు. మహ్మద్‌ ప్రవక్తకు ఎంతో ఇష్టమైన ఆహారంగా ఖర్జూరాన్ని చెబుతుంటారు. అందుకే.. ఇస్లామిక్‌ దేశాల్లో ఖర్జూర వృక్షాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు. ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం రంజాన్‌ నెలను ఎంతో పవిత్రంగా చూస్తారు. అందుకే ఈ నెల మొత్తం ఉపవాసాలు ఉంటూ తమ పాపాలను ఒప్పుకుంటూ ధార్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ మాసంలో ప్రతీ రోజూ ఖర్జూరం తినని వాళ్లుండరు.

ఉపవాస దీక్షలు పాటించే ముస్లింలు.. ఖర్జూరం పండుతోనే దీక్ష విరమణ చేస్తారు. అలాంటి పండ్లకు హైదరాబాద్‌ కేరాఫ్‌గా మారింది. విదేశాల నుంచి దిగుమతి అయిన ఈ పండ్ల వ్యాపారం. కేవలం వారం రోజుల్లోనే రూ. 500 కోట్ల వ్యాపారం సాగిందంటే.. ఈ పండ్లకున్న డిమాండ్‌ను అర్దం చేసుకోవచ్చు. అరబ్బు దేశాలైన ఇరాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ, తూనిషీయా, అల్‌జరీయా వంటి దేశాల ఖర్జూరాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇరానీ కప్‌, ఇరానీ ఫనాకజర్‌, బాందా ఖర్జూర్‌ పండ్లకు ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. నాణ్యతను బట్టి కిలో 150 రూపాయల నుంచి 650 వరకు ధర పలుకుతున్నాయి. కరోనాకాలంలో దాదాపు అన్ని రకాల వస్తువులు ధరలు బాగా పెరిగాయి. అందులో ఇవి కూడా ఉన్నాయి. ఇతర ఆహార పండ్ల రేట్లను పరిశీలిస్తే.. పదేళ్లకాలంలో 70 శాతం పెరిగినట్టు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ఎండాకాలంలో శరీరంలోని నీరు బయటకు పోయి డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశముంటుంది. ఆ సమయంలో.. ఖర్జూరపండ్లు తింటే డీహైడ్రేట్‌ కాకుండా ప్రశాంతంగా ఉంటుంది.

Also Read: ఆ ఇంటి ముందు డోర్ పంజాబ్‌లో తెరుచుకుంటే.. వెనుక డోర్ హర్యానాలో తెరుచుకుంటుంది

విశాఖ నరమేధంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు