Viral News: ఆ నదిలో ప్రవహించేది స్వచ్ఛమైన పాలు.. ఆశ్చర్యపోతున్న జనం.. అసలు విషయమేంటంటే.!
నదుల్లో నీరు ప్రవహిస్తుండటం సర్వ సాధారణం. కానీ మీరు ఎప్పుడైనా పాలు నదిలా ప్రవహించడం చూశారా.? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా..
నదుల్లో నీరు ప్రవహిస్తుండటం సర్వ సాధారణం. కానీ మీరు ఎప్పుడైనా పాలు నదిలా ప్రవహించడం చూశారా.? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని చూసిన అందరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంఘటన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్ నగరంలో చోటు చేసుకుంది. ఆ నదిలో ఎప్పటిలానే నీరు ప్రవహిస్తూ ఉంది. కానీ అకస్మాత్తుగా ఏప్రిల్ 14వ తేదీన పాలు నదిలో ప్రవహించడం మొదలుపెట్టాయి. మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు.! నీరు ఎలా పాలుగా మారింది అని ఆశ్చర్యపోవచ్చు.! అసలు ఆ నదిలో పాలు ప్రవహించడానికి గల కారణం ఇలా ఉంది.
నదికి సమీపంలో జరిగిన ఓ ప్రమాదంలో పాల ట్యాంకర్ బోల్తా పడింది. దీని వల్ల పాలు నదిలోకి ప్రవహించడం మొదలుపెట్టాయి. ఈ కారణంగానే నదిలోని నీరు అంతా తెల్లగా మారింది. ఇదిలా ఉంటే నదిలో పాల ప్రవాహాన్ని చూసిన జనాలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మొదటిగా నీరు ఎందుకు తెల్లగా మారిందో అక్కడి స్థానికులకు తెలియలేదు గానీ… ఆ తర్వాత కారణం తెలిసి అవాక్కయ్యారు.
When a milk tanker overturns in the river #llanwrda #wales #milk pic.twitter.com/vnyhr5FXBi
— May ??????? (@MayLewis19) April 14, 2021
Also Read:
ఆ వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు ఎక్కువ.. తస్మాత్ జాగ్రత్త.! హెచ్చరిస్తున్న వైద్యులు..
మద్యం సేవిస్తే కరోనా వైరస్ తగ్గుతుందా.? అపోహలు.. నిజాలు.! వివరాలివే..
కూరగాయలు సర్దుతుండగా భార్యాభర్తలకు ఊహించని షాక్.. పాలకూరలో నక్కిన పాము.. భయానక వీడియో.!